Just In
- 13 min ago
దేవుడా ఎందుకీ శిక్ష.. అందుకే డ్రగ్స్‌కు బానిసను అయ్యా.. జస్టిన్ బీబర్ సంచలన ప్రకటన
- 20 min ago
ఆరియానాను అక్కడ టచ్ చేసిన అవినాష్: ఏకంగా ఆ ప్లేస్‌లో ముద్దు కూడా.. వామ్మో ఇది మహా దారుణం
- 1 hr ago
యాంకర్ రవికి భారీ షాకిచ్చిన భార్య: రోజూ మూడు తర్వాతే.. మొబైల్లో అలా అంటూ సీక్రెట్ లీక్ చేసింది
- 2 hrs ago
పెళ్లిపై నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్: పీక కోసేస్తానని బెదిరించింది.. అందుకే అలా చేశానంటూ!
Don't Miss!
- Sports
SRH vs RCB:రన్స్ చేయడం మాకు కష్టమైనప్పుడు.. అవతలి వాళ్లకూ అంతే కదా! మా వాళ్లకి ఒక్కటే చెప్పా: కోహ్లీ
- News
విశాఖలో దారుణం : ఎన్ఆర్ఐ ఫ్యామిలీ హత్య ,ఆపై అగ్ని ప్రమాదంగా చిత్రీకరణ
- Finance
LIC ఉద్యోగులకు శుభవార్త, 20 శాతం వరకు వేతన పెంపు
- Lifestyle
ఈ రాశుల వారు ఆ విషయంలో ‘తగ్గేదే లే’ అంటారట...! ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూడండి...!
- Automobiles
మరో ఏడాది కాలం పొడగించిన ఫేమ్ II సర్టిఫికెట్స్ వ్యాలిడిటీ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
స్టార్ హీరోయిన్‌కు తండ్రిగా.. బాలకృష్ణ మరింత బోల్డ్‌గా
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రయోగాత్మక చిత్రాలు చేసే వారిలో స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ పేరును ప్రప్రథమంగా చెప్పుకోవచ్చు. అప్పట్లో 'భైరవ దీపం', 'ఆదిత్య 369' సహా ఎన్నో సరికొత్త కథలతో సినిమాలు చేసి దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్నారాయన. అలాగే, తన వద్దకు కథ చెప్పడానికి వచ్చిన ఎంతో మందిని డైరెక్టర్లుగా పరిచయం చేసిన ఘనత కూడా ఆయనకే సొంతం. అందుకే ఆయనను డైరెక్టర్ హీరో అంటుంటారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఓ సీనియర్ డైరెక్టర్ కోసం బాలయ్య మరో ప్రయోగం చేయబోతున్నారని ఓ న్యూస్ బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే....

ఏకంగా మూడు.. బాలయ్యకు భారీ షాక్
నందమూరి బాలకృష్ణకు గత సంవత్సరం ఏకంగా మూడు ఫ్లాప్‌లు ఎదురయ్యాయి. 2019 ఏడాది ప్రారంభంలో వచ్చిన ‘యన్.టి.ఆర్ కథానాయకుడు', ‘యన్.టి.ఆర్ మహానాయకుడు' భారీ పరాజయాలను మూటగట్టుకున్నాయి. ఇక, ఏడాది చివర్లో వచ్చిన ‘రూలర్' కూడా బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది. బయోపిక్‌కు నిర్మాతగానూ వ్యవహరించడంతో బాలయ్య నష్టాలు వచ్చాయి.

హిట్ కోసం కలిసొచ్చిన డైరెక్టర్‌తో కలిశాడు
వరుస పరాజయాలతో సతమతం అవుతున్నాడు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఇలాంటి తరుణంలో హిట్ ట్రాక్ ఎక్కేందుకు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిశాడు. గతంలో వీళ్ల కాంబినేషన్‌లో ‘సింహా', ‘లెజెండ్' వంటి రెండు సూపర్ హిట్లు వచ్చాయి. దీంతో ఈ సినిమాపైనా అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. కలిసొచ్చిన కాంబో కావడంతో హిట్ ఖాయంటున్నారు ఫ్యాన్స్.

తొలిసారి ఆ తరహా ప్రయోగంతో బాలయ్య
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం అదిరిపోయే కథను రెడీ చేశాడట బోయపాటి శ్రీను. ఇందులో కూడా బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ఆయన అఘోరాగా కనిపించబోతున్నాడని చిత్ర యూనిట్ కన్ఫార్మ్ చేసేసింది. దీంతో ఆ పాత్ర ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది.

మరో సినిమానూ లైన్‌లో పెట్టిన నటసింహా
బోయపాటి శ్రీను మూవీ షూటింగ్ పూర్తవకముందే నందమూరి బాలకృష్ణ మరో సినిమాను లైన్‌లో పెట్టేశారు. దీనికి సీనియర్ డైరెక్టర్ బీ గోపాల్ దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ సినిమా కోసం పవర్‌ఫుల్ స్టోరీని రెడీ చేశారని అంటున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడనుందనే టాక్ వినిపిస్తోంది.

నందమూరి బాలకృష్ణ సంచలన నిర్ణయం
బీ గోపాల్‌తో బాలయ్య సినిమా చేయబోతున్నాడన్న వార్త కొద్ది రోజులుగా హాట్ టాపిక్ అవుతోంది. కానీ, దీనికి సంబంధించిన మరే వివరమూ తెలియలేదు. అయినప్పటికీ.. ఈ ప్రాజెక్టు గురించి ఎన్నో విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే నందమూరి హీరో ఈ ప్రాజెక్టు విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది.

స్టార్ హీరోయిన్‌కు తండ్రిగా నందమూరి హీరో
తాజా సమాచారం ప్రకారం... ఈ సినిమాలో బాలయ్య యాభై సంవత్సరాల వయసున్న పోలీస్ అధికారిగా కనిపించబోతున్నాడట. అంతేకాదు, ఓ అమ్మాయికి తండ్రిగా కూడా దర్శనమిస్తాడని అంటున్నారు. బాలయ్య కూతురి పాత్రకు ఓ స్టార్ హీరోయిన్‌నే తీసుకోబోతున్నారని ఓ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.