గాయం బాధిస్తున్న బాలయ్య అత్యుత్సాహం.... త్వరలో సర్జరీ?
Recommended Video

వెండితెరపై అభిమానులను ఎంటర్టెన్ చేయడానికి కొందరు స్టార్స్ రిస్కీ షాట్స్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి గాయాల పాలవుతుంటారు. తెలుగులో అగ్రహీరోగా దశాబ్దాలుగా తన హవా కొనసాగిస్తున్న బాలయ్య కొన్ని రోజుల క్రితం షూటింగులో గాయపడ్డారు. ఆయన కుడి భుజానికి గాయమైంది.

8 నెలలుగా బాధిస్తోన్న గాయం
8 నెలల క్రితం షూటింగులో బాలయ్య కుడి భుజానికి గాయం అయింది. అయితే పైసా వసూల్, జై సింహ బిజీ షెడ్యూల్ వల్ల గాయానికి సరైన చికిత్స తీసుకోలేదు. దీంతో ఆగాయం మళ్లీ తిరగబెట్టినట్లు తెలుస్తోంది.

బాధను భరిస్తూ...
బాలయ్య ఇంతకాలం ఆ బాధను భరిస్తూనే షూటింగుల్లో పాల్గొన్నారు. సర్జరీ చేస్తేనే పూర్తిగా క్యూర్ అవుతుందని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే సర్జరీ వల్ల రెండు మూడు నెలలు షూటింగులకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. అప్పటికే బాలయ్య పలు సినిమాలకు కమిట్మెంట్స్ ఇవ్వడంతో..... సినిమా షెడ్యూల్స్ డిస్ట్రబ్ అవుతాయని, నిర్మాతకు నష్టలాలు వస్తాయని ఆ బాధను భరిస్తూనే ఇంతకాలం షూటింగులో పాల్గొన్నారు.

మొండిగా వెలుతున్న బాలయ్య
ప్రస్తుతం బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా మొదలు పెట్టవ్వడానికి ముందే సర్జరీ చేసుకోవాలని వైద్యులు సూచించినా బాలయ్య మాత్రం వినకండా మొండిగా, అత్యుత్సాహంతో సినిమా షూటింగులో మునిగి పోయారు.

సన్నిహితుల్లో ఆందోళన
బాలయ్య ఇప్పటికైనా షూటింగులకు బ్రేక్ ఇచ్చి సర్జరీ పూర్తి చేసుకోవాలని, మొండితనం వీడి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సన్నిహితులు సూచిస్తున్నారు. అభిమానులు సైతం ఇదే కోరుకుంటున్నారు.

త్వరలో సర్జరీ
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలో బాలయ్య సర్జరీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే అది ఎన్టీఆర్ బయోపిక్ పూర్తయిన తర్వాత ఉంటుందా? లేక తర్వాత ఉంటుందా? అనే విషయంలో ఓ క్లారిటీ రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











