NBK Unstoppable: మొదటి షోకు బాలకృష్ణ తీసుకోబోయే రెమ్యునరేషన్ ఎంతంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మన అగ్ర హీరోలు వేస్తున్న అడుగులు చాలా విబిన్నంగా ఉంటున్నాయి. ఒకప్పుడు స్టార్ హీరోలు సినిమాలు తప్పితే మరి ఇతర విషయాలపై పెద్దగా పట్టించుకునేవారు కాదు. నార్త్ ఇండస్ట్రీలో అయితే చాలా వరకు అగ్ర హీరోలు బుల్లితెరపై కూడా ఏదో ఒక విధంగా ఆకట్టుకుంటూ వస్తున్నారు. హోస్టింగ్ అనేది ఈ రోజుల్లో చాలా స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది. అభిమానుల సంఖ్యను పెంచుకోవడమే కాకుండా ఎంతో ఆదాయాన్ని కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది

కాబట్టే అగ్రహీరోలు బుల్లితెరపై వచ్చిన అవకాశాలను ఏమాత్రం వదులుకోవాలని అనుకోవడం లేదు. వారికి నచ్చిన రీతిలో కొనసాగేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇటీవల నందమూరి బాలకృష్ణ కూడా ఆహా అన్‌స్టాప‌బుల్‌ షో హోస్టింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే షో కోసం బాలయ్య తీసుకుంటున్న రెమ్యునరేషన్ పై ఒక టాక్ అయితే వైరల్ గా మారుతోంది.

ఆ రూట్ చాలా ఉపయోగపడుతుంది

ఆ రూట్ చాలా ఉపయోగపడుతుంది

మన అగ్ర హీరోలు కూడా ఈ రోజుల్లో బుల్లితెరపై కనిపించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఒక విధంగా అభిమానుల సంఖ్యను పెంచుకోవడానికి కూడా ఆ రూట్ చాలా ఉపయోగపడుతుంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ఆర్ బిగ్ బాస్ షో ద్వారా మంచి క్రేజ్ అందుకొని ఆ తర్వాత మళ్లీ ఆ కాంట్రవర్సీ టచ్ చేయకుండా ఎవరు మీలో కోటీశ్వరులు షోను సొంతంగా మొదలు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఆ షోకు రేటింగ్స్ ఐతే భారీగానే వస్తున్నాయి.

బాలయ్య అన్‌స్టాప‌బుల్‌ షో

బాలయ్య అన్‌స్టాప‌బుల్‌ షో

ఇక ముందుగానే అబ్బాయి మొదలు పెట్టగా ఇప్పుడు బాబాయ్ కూడా అదే బాటలో కొనసాగేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ బుల్లితెర పై కాకుండా బాలకృష్ణ ఓటీటీ షో తో ఆకట్టుకోవలని చూస్తున్నాడు. ఇటీవల ఆహా అన్‌స్టాప‌బుల్‌ షో కు సంబంధించిన ఈవెంట్ ను కూడా గ్రాండ్ గా నిర్వహించారు. నందమూరి బాలకృష్ణ సరికొత్తగా కనిపించనున్నారు అని అర్థమవుతోంది. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ అలాగే మరొక సీనియర్ రైటర్ బివిఎస్ రవి కూడా అన్‌స్టాప‌బుల్‌ ను డైరెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

రెమ్యునరేషన్ ఎంతంటే

రెమ్యునరేషన్ ఎంతంటే

ఇక నందమూరి బాలకృష్ణ ఆ షో కోసం రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలో డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. మొదటి సారి బాలయ్య చేస్తున్న ఈ టాక్ షో కోసం ఐదు నుంచి ఆరు కోట్ల మధ్యలో తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షోకు సంబంధించిన కొన్ని ఎపిసోడ్లు అయితే షూట్ చేశారు. త్వరలోనే ప్రోమో కూడా విడుదల చేయనున్నారు. బాలకృష్ణ కూడా డిఫరెంట్ హోస్టింగ్ తో ప్రేక్షకులను సరికొత్తగా ఆకట్టుకోబోతున్నట్లు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది.

మొదటి గెస్ట్ ఎవరు?

మొదటి గెస్ట్ ఎవరు?

మొదట షో కోసం ముఖ్య అతిథులుగా ఎవరు వస్తారు అనే విషయంలో కూడా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. మంచు మోహన్ బాబు మంచు విష్ణు కూడా బాలయ్య షో లో పాల్గొంటారని ఇప్పటికే ఒక టాక్ వచ్చింది. అలాగే మెగా హీరోలు చిరంజీవి రామ్ చరణ్ తేజ్ కూడా సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం బాలకృష్ణ అఖండ సినిమా విడుదలకు సిద్దంగా ఉన్న విషయం తెలిసిందే.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఇక నవంబర్ లో విడుదల చేయాలని అనుకున్నప్పటికీ ఇప్పటివరకు అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X