నెల ముందే బాలయ్య బాబు హంగామా..! తోడు కాబోతున్న వెంకటేష్
ప్రతీ పండగకు వెండితెర కళకళలాడటం సాధారణమే. ఇక సంక్రాంతి వేళ అయితే సిల్వర్ స్క్రీన్ హంగామా ఉంటుంది. ఎప్పటిలాగే వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా పెద్ద ఎత్తున సినిమాలు విడుదల కాబోతున్నాయి. సంక్రాంతి టార్గెట్‌గా పలు సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో, రజినీకాంత్ దర్బార్ వంటి భారీ సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి.
సంక్రాంతి వచ్చిందంటే తెలుగు ప్రేక్షకులకు వినోదాల విందు ఇవ్వడం బాలకృష్ణ స్టైల్. ఎప్పటి నుంచో ఇదే ఆనవాయితీగా చేస్తూ వస్తున్న బాలయ్య బాబు ఈ సారి మాత్రం ట్రాక్ చేంజ్ చేశాడని తెలుస్తోంది. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన కొత్త సినిమాను సంక్రాంతికి నెల ముందుగానే అంటే డిసెంబర్ నెలలోనే ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాడట బాలయ్య. ఇదిలా ఉంటే బాలయ్యకు వెంకటేష్ తోడు కూడా దొరికిందని తెలుస్తోంది.

దసరా సందర్భంగా విడుదల చేయాలనుకున్న వెంకీ మామ సినిమా దీపావళికి వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం దీపావళికి కాకుండా డిసెంబర్‌లోనే ఈ సినిమాను విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట. అలా బాలకృష్ణ, వెంకటేష్ బాక్సాఫీస్ బరిలో ఒకరికి ఒకరు తోడు కాబోతున్నారన్నమాట. ఈ రెండు సినిమాలే కాదు రవితేజ హీరోగా రూపొందుతున్న డిస్కోరాజా, నితిన్ హీరోగా వస్తున్న భీష్మ, శర్వానంద్ హీరోగా నటిస్తున్న 96, సాయిధరమ్ తేజ్ హీరోగా రాబోతున్న ప్రతీరోజు పండగే సినిమాలు కూడా అదే డిసెంబర్ నెలలో విడుదల కాబోతున్నాయి. అంటే ఈ సంక్రాంతి రంగుల హరివిల్లు డిసెంబర్ లోనే మొదలు కానుంది.


Click it and Unblock the Notifications











