Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మూడు పడవలపై బాలయ్య ప్రయాణం...!?
బాలకృష్ణ "సింహా" కు హిట్ టాక్ వచ్చినా కలెక్షన్ల విషయం స్పష్టంగా తెలియడం లేదు. సింహా తర్వాత తన కెరీర్ మలుపు తిరుగుతుం దని బాలకృష్ణ ఆశిస్తున్నారు. ఈ సినిమా బాలయ్య అభిమానులకు కొంత వరకు సంతృప్తి పరిచింది.
తెలుగు దేశం పార్టీలో చంద్రబాబుకి బాలయ్య బాబే కరెక్ట్ అంటూ మొదట టాక్ వచ్చింది. బాబుకు బాబు పోటి కాదని జూనియర్ ఎన్టీఆర్ బాబు ఉన్నాడని యువత భావించింది. ఇంతమంది బాబుల్ని మేము భరించలేమని తెలుగు తమ్ముల్లు వాపోతున్నారు. ఎలాగూ ఇటు సినిమాలు అటు రాజకీయాలలో రెండు పడవల ప్రయాణం చేస్తున్న ఈ బాలయ్య బాబు ముచ్చటగా మూడవ పడవలో ప్రయాణించనున్నారు. అదేంటంటే ఈ నెల 13న జరగనున్న స్టార్ క్రికెట్(టి20 టాలీవుడ్ ట్రోపి)లో తన ప్రతాపం చూపిస్తానని ఇప్పటికే అన్నారు. తాను బోలింగ్, బ్యాటింగ్ రెండు చేస్తానని సింహా గర్జన చేశాడు. అంటే స్టేడియంలో ఈయన ప్రతాపం చూపించనున్నాడా? ఈయన బౌలింగ్ చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని మిగతా జట్ల బ్యాట్స్ మెన్స్ అలర్ట్ అవబోతున్నారు.
ఇక బ్యాటింగ్ విషయానికొస్తే సిక్స్ లు కొడతాడా?లేక....?ఏమైనా సినిమాలు, రాజకీయాలు, క్రికెట్ మ్యాచ్ లతో బాలయ్య హ్యాట్రిక్ కొడతాడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఏమైనా బాలయ్య..దాసరి దర్శకత్వంలో నటిస్తున్నావు. మరో యంగ్ ఇండియా, నీకు ఎదురుకాకుండా చూసుకోమని ఆయన అభిమానుల ఆకాంక్ష.