ఎన్టీఆర్ హీరోగా వి.వి.వినాయిక్ దర్శకత్వంలో ఓ సినిమా రెడీ అవుతున్నసంగతి తెలిసిందే. ఈ సినిమాలో అతిధిగా బాలకృష్ణ కనిపించబోతున్నారనే వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో షికారు చేస్తోంది. అయితే ఆ సన్నివేశాలు కీలకమైనవని చెబుతున్నారు.ఇక ఈ సినిమా పోలీస్ స్టోరీ అనీ అయితే ప్రేమ కథగా ఉంటుందని చెప్తున్నారు.అయితే రామ్ చరణ్ తేజ సినిమాలో చిరంజీవి కనిపించినట్లు కొద్ది సేపే కనిపిస్తారా...అనేది మాత్రం సస్పెన్స్ గా ఉంది. అలాగే జిమ్మిక్కులకు పోకుండా కథను నమ్ముకునే వినాయిక్ సినిమాలో నిజంగా బాబాయ్ అబ్బాయి కనపడే సన్నివేశం ఉంటే మాత్రం దానికి తగ్గ ప్రాముఖ్యత ఉంటుందనేది అందరూ నమ్మే విషయం. ఇక ఈ కాంబినేషన్ కబురు నిజమైతే నందమూరి అభిమానుల ఆనందానికి అంతే ఉండదు. ఇక ఈ సినిమా ఈ నెల 20వతేదీ నుండి వరస షూటింగ్ జరుపుకుంటుంది.