»   » నటసింహా బాలయ్యతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్...

నటసింహా బాలయ్యతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమదైన వ్యక్తిత్వాన్ని చాటుకోవడంలోనూ తమకంటూ ఏర్సడ్డ ప్రత్యేక గుర్తింపుని నిలుపుకోవడంలోనూ సమవుజ్జీవులైన సాటిలేని కథానాయకులు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్. అంతే కాదు ఇటు స్టార్ ఇమేజ్ లోనూ, అటు ఫ్యాన్ ఫాలోయింగ్ లో కూడా ఇద్దరూ ఇద్దరే, ఎవరికెవరూ తగ్గరనిపించే కాంబినేషన్ ఇది. మరి వీరిద్దరి కలయిక ఏర్సడితే? ఇద్దరూ ఒకే వేదికపై కలిసి కనిపిస్తే?అదెలా వుంటుందో?అదెంత సంచలనం అవుతుందో మనందరం ఊహించగలం.

అయితే ఆ ఊహని అతి త్వరలోనే నిజం చేసే ప్రయత్నాలు ప్రస్తుతం ముమ్మరంగా జరుగుతున్నాయని సమాచారం. మరింతకీ ఈ అరుదైన కలయికని మీరు ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడనున్నారనే పూర్తి వివరాల కోసం మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. అన్ని కన్ ఫామ్ కాగానే మరో స్పెషల్ న్యూస్ మీ ముందుంచుతాం...

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu