4.5 కోట్లు పలికిన బాలకృష్ణ డైలాగ్.. స్టార్ హీరో కోసం రైట్స్ కొన్న నిర్మాత
నట సింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ గ్రాఫ్ కొత్త పుంతలు తొక్కుతున్నది. నటుడిగానే కాకుండా రియాలిటీ షో హోస్ట్‌గా కూడా అద్బుతంగా రాణిస్తున్నారు. వరుసగా సినిమాలను విజయపథంలో నడిపిస్తూ హీరోగా బాక్సాఫీస్ వద్ద హల్‌చల్ చేస్తున్నారు. అయితే గత కొద్ది సంవత్సరాలుగా బాక్సాఫీస్ వద్ద కూడా మెరుగైన ఫలితాలను అందుకొంటున్నాడు. అయితే తాజాగా బాలకృష్ణ నటించిన ఓ సినిమాలోని డైలాగ్‌కు సంబంధించిన రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోయాయనే విషయం మీడియా, సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఆ సినిమా ఏంటి? బాలయ్య చెప్పిన డైలాగ్స్‌కు ఉన్న ప్రాముఖ్యత ఏంటి? అనే విషయాల్లోకి వెళితే..
పొలిటిషియన్‌గా, యాక్టర్‌గా బాలకృష్ణ విభిన్నమైన పాత్రను పోషిస్తున్నారు. రాజకీయాల్లోను, వ్యాపార రంగాల్లో బిజీగా ఉంటూనే వరుసగా సినిమాల్లో నటిస్తూ తనదైన సత్తాను చూపిస్తున్నాడు. సినిమాలు, రాజకీయాలే కాకుండా టెలివిజన్, ఓటీటీలో షోలు చేస్తూ ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యాడు. గతంతో పోల్చుకొంటే బాలయ్య కెరీర్ గ్రాఫ్ ఎవరూ ఊహించని విధంగా ఎగిపిపడుతున్నది.

ఇటీవల బాలయ్య మాట్లాడుతూ.. నా కెరీర్‌లో విభిన్నమైన పాత్రలు విలక్షణమైన నటన నాలో చూస్తారు. రానున్న సినిమాలు నాలోని కొత్త నటుడిని పరిచయం చూపిస్తాయి. ఇక నుంచి ఎంచుకొన సినిమాలు నా అభిమానులకు ఆనందాన్ని అందిస్తాయి అని బాలయ్య క్లారిటీ ఇచ్చారు. దాంతో బాలకృష్ణను కొత్తగా చూడటం ఖాయమని ఓ నిర్ణయానికి వచ్చారు.
అయితే బాలకృష్ణ నటించిన నేలకొండ భగవంత్ కేసరి సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమ కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా రాబట్టింది. అయిత ఈ సినిమాను తమిళంలో ఇళయదళపతి విజయ్ హీరోగా జన నాయకన్ టైటిల్‌తో మూవీని రూపొందిస్తున్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన విజయ్.. ఆయన కెరీర్‌లో చివరి సినిమాగా పేర్కొంటున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్గే, మమితా బైజు నటిస్తున్నారు.
ఇదిలా ఉండగా భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణ చెప్పిన గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ డైలాగ్‌కు పాపులారిటీ ప్రశంసలు లభించాయి. అయితే ఈ సినిమాలో ఆ డైలాగ్ కోసం జన నాయకన్ సినిమా యూనిట్ స్పెషల్ అనుమతి తీసుకోవడంతోపాటు ఆ ఎపిసోడ్‌లోని డైలాగ్స్‌కు సుమారుగా 4 కోట్ల రూపాయలు రైట్స్‌గా చెల్లించారని తెలిసింది. అయితే ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకొన్నారన్న విషయం విదితం.
బాలకృష్ణ కెరీర్ సినిమాల విషయానికి వస్త.. ప్రస్తుతం ఆయన అఖండ 2 సినిమాను బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నారు. రజనీకాంత్‌తో జైలర్ 2 సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నారు. వీరసింహారెడ్డి దర్శకుడితో మరో సినిమాలో నటించందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంకా పలు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి .


Click it and Unblock the Notifications











