ఆ హీరోయిన్‌పై కన్నేసిన బాలయ్య కొడుకు, ఎన్టీఆర్ బావమరిది.. ఇద్దరికీ ఆమెనే కావాలట!

సినిమా ఇండస్ట్రీలో వారసత్వం ఉంటే ఈజీగా ఎంట్రీ ఇవ్వొచ్చు. కానీ దానికి తగ్గ అవుట్ పుట్ చూపెడితేనే... ఆ హీరో అయినా.. హీరోయిన్ అయినా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు. అలా చాలా మంది హీరోలు.. తండ్రికి తగ్గ తనయులుగా పేరుతెచ్చుకున్న వాళ్లూ ఉన్నారు.. కొంత మంది కొన్ని సినిమాలు తీసి.. ఫేమ్ రాక ఆపేసిన వాళ్లు ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఇండస్ట్రీకి ఇద్దరు వారసులు రాబోతున్నారు. వాళ్లు రావడమే కాదు.. వారి సినిమాల కోసం.. ఓ హీరోయిన్ పై కన్నేశారు. ఇద్దరికీ ఆమెనే హీరోయిన్ గా కావాలట. ఆ వివరాల్లోకి వెళితే...

ఇండస్ట్రీలోకి ఇద్దరు వారసులు...:ఇండస్ట్రీకి కొత్త వారసులు రాబోతున్నారు. వాళ్లు ఎవరో కాదు.. బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఒకరు కాగా... మరొకరు ఎన్టీఆర్ బావమరిది. అయితే వీరు ఓకే కుటుంబం నేపథ్యం కలిగిన వారు. ఇక నందమూరి కుటుంబం నుంచి వీరు ఎంట్రీ ఇస్తున్నప్పటికీ.. దానికి తగ్గ అవుట్ పుట్ ఉంటేనే..ప్రేక్షకులు ఆదరిస్తారు. అందుకోసం వీరు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మోక్షజ్ఞ సినిమా ఇంకా ఫైనల్ కాలేదు. ఎన్టీఆర్ బావమరిది నితిన్ మొదటి సినిమా మాత్రం పూర్తి అయింది.

Balakrishnas son Mokshajna and NTRs brother-in-law Narne Nithins films will select Sreeleela as the heroine.

పాన్ ఇండియా లెవెల్ లో....:ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి బ్రదర్ నితిన్ హీరోగా ఓ సినిమా ఇప్పటికే తెరకెక్కింది. శ్రీశ్రీశ్రీ రాజావారు అనే సినిమాను పూర్తి చేసి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు ఈ కుర్ర హీరో. ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందే తన నెక్ట్స్ మూవీ కోసం.. భారీ ప్లాన్ వేశాడు. నితిన్ సైన్ చేసిన సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఉంటుందని సమాచారం. అది కూడా భారీ ప్రొడక్షన్ హౌస్ గీత ఆర్ట్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తారట.

లవ్ ఎంటర్ టైనర్ గా... :నిర్మాత అల్లు అరవింద్ కూడా ఈ కుర్ర హీరో కోసం... ఓ టాప్ మోస్ట్ దర్శకుడు సైతం లైన్లో పెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గీతాగోవిందం లాంటి సినిమాతో ఈ హీరో సినిమా ఉండబోతుందని ఫిలిం వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అయితే ఈ సినిమా కోసం.. ఓ యంగ్ బ్యూటీని అనుకున్నారట. ఎన్టీఆర్ కూడా ఆ బ్యూటీ అయితే కరెక్టు అని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Balakrishnas son Mokshajna and NTRs brother-in-law Narne Nithins films will select Sreeleela as the heroine.

హీరోయిన్ పై కన్ను....:తను ఎవరో కాదు.. వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న శ్రీలీల. ఎన్టీఆర్ బావమరిది నితిన్, శ్రీలీల కలిసి ఓ లవ్ ఎంటర్ టైనర్ సినిమాలో నటించబోతున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. బాలయ్య బాబు కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం రంగం సిద్ధం అవుతోంది. ఇక ఈ సినిమాకు దర్శకుడు కూడా ఫిక్స్ కాలేదు.. కానీ హీరోయిన్ ను ఫిక్స్ చేశాడు బాలయ్య.

Balakrishnas son Mokshajna and NTRs brother-in-law Narne Nithins films will select Sreeleela as the heroine.

ఆ భామ కోసం పోటీ...:కొడుకు కోసం కుర్ర హీరోయిన్ శ్రీలీల అయితే కరెక్ట్ అని భావించడట. మోక్షజ్ఞ పక్కన శ్రీలీల అయితే బాగుంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్. ఇక బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో శ్రీలీల.. బాలయ్య కూతురిగా కనిపిస్తుందని ప్రచారం సాగుతోంది. ఇక ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అలా శ్రీలీల కోసం.. ఇద్దరు వారసులు లైన్లో ఉన్నారనమాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X