బాలకృష్ణ మూవీలో ‘డర్టీ’ హీరోయిన్?
చాలా వరకు ఓ రేంజ్ లో హాట్ స్కిన్ షో చేసే హీరోయిన్స్ లో దాదాపు ఎక్కువ శాతం హిందీ సినిమా నుంచే కనిపిస్తారని అందరికీ తెలిసిందే. కాగా కొన్నేళ్ల కితం ఇలాంటి హాట్ షోతోనే సంచలనం సెట్ చేసిన బాలీవుడ్ బ్యూటీ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా నటి విద్యా బాలన్ అని చెప్పాలి. కాగా విద్యా బాలన్ హిందీ సినిమాలో కెరీర్ స్టార్ట్ చేసిన కొంత సమయంలోనే అక్కడ ఊహించని సంచలనం రేపింది.
ముఖ్యంగా ఆమె చేసిన డర్టీ పిక్చర్ సినిమాతో అయితే పలు కాంట్రవర్సీలు కూడా ఆమె ఎదుర్కోగా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం అందుకున్న తర్వాత ఇక ఆ తర్వాత నుంచి ఆ రేంజ్ లో హాట్ షో చేయడం మాత్రం ఆపేసింది. మరి ఆ తర్వాత నుంచి కొంచెం సెటిల్డ్ పాత్రలే తాను చేస్తుండగా అక్కడ నుంచి విద్యా బాలన్ నార్త్ నుంచి సౌత్ సినిమాకి కూడా రావడం జరిగింది.

ఇలా కొన్నేళ్ల కితమే మన తెలుగులో సీనియర్ హీరో నందమూరి నటసింహ బాలకృష్ణ సరసన ఫీమేల్ లీడ్ లో కనిపించిన విద్యా ఇపుడు మరోసారి తెలుగులో అవకాశం దక్కించుకున్నట్టుగా ఇపుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా మళ్ళీ రెండోసారి కూడా తెలుగులో బాలయ్య సినిమాకి సంబంధించే వార్తలు వినిపిస్తుండడం గమనార్హం.
కాగా గత సినిమాలు బాలయ్య ఎన్టీఆర్ కథా నాయకుడు అలాగే మహా నాయకుడు సినిమాల్లో బాలయ్య భార్య పాత్రలో ఆమె కనిపించగా ఈసారి మాత్రం ఇలాంటి పాత్రలో కాదు అని తెలుస్తుంది. ఈసారి బాలయ్యకి అపోజిట్ గా నెగిటివ్ రోల్ లో విద్యా బాలన్ కనిపిస్తారని టాక్. అన్నట్టు ఇంతకీ ఏ సినిమాలో అంటే దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో చేస్తున్న అవైటెడ్ భారీ సీక్వెల్ చిత్రం 'అఖండ పార్ట్ 2 తాండవం'లో అట.
ఈ సినిమాలో ఇపుడు విద్యా బాలన్ నెగిటివ్ రోల్ అది కూడా ఒక పొలిటికల్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. కాగా మేకర్స్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ ని అనౌన్స్ చేశారు. సో ఇలా బాలీవుడ్ నుంచి స్కోప్ కోసం ఆమెని బోయపాటి శ్రీను లాక్ చేసినట్టుగా వినికిడి. కాగా ఆమె విషయంలో మాత్రం మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం విద్యా బాలన్ హిందీ సినిమాలోనే బిజీగా ఉన్నారు.
ఒకవేళ బాలయ్య సినిమా నిజం అయితే చాలా ఏళ్ళు తర్వాత మళ్ళీ సౌత్ లోకి వస్తున్నట్టే.. ఇక అఖండ 2 సినిమాని బోయపాటి గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో పార్ట్ 1 లో ఉన్న ప్రగ్యా జైస్వాల్ సహా మరో యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్ కూడా నటిస్తుంది. అలానే కీలక పాత్రలో ఓ ప్రముఖ నటి కూతురు కూడా కనిపించనుంది అని సినీ వర్గాల్లో టాక్ ఉంది. కాగా ఈ చిత్రాన్ని మేకర్స్ ఈ ఏడాది సెప్టెంబర్ 25న భారీ ఎత్తున విడుదలకి సన్నాహాలు చేస్తున్నారు. ఆల్రెడీ బాలయ్య వరుసగా 4 హిట్స్ తో ఫామ్ లో ఉండేసరికి దీనిపై కూడా గట్టి హైప్ ఉంది.


Click it and Unblock the Notifications











