Balakrishna: బాలయ్య ఫ్యాన్స్.. బాబు దిగుతుండు గెట్ రెడీ.. చొక్కాలు చిరుగుడే ఇక!
బాలయ్య ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునే టైం వచ్చేసింది. జై బాలయ్య అంటూ అరుపులు వేసేందుకు సమయం ఆసన్నం అవుతోంది. ఇక నటసింహం నందమూరి బాలయ్య ఎంట్రీకి రంగం సిద్ధం అవుతుంది. బాలయ్య నటిస్తున్న తాజా చిత్రం భగవంత్ కేసరి థియేటర్లలో గర్జించేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ మూవీ ట్రైలర్ టైం కూడా ఫిక్స్ అయింది. అయితే భగవంత్ కేసరి ట్రైలర్ రివ్యూ బయటకు వచ్చేసింది. ఆ వివరాల్లోకి వెళితే...
నందమూరి నటసింహం బాలకృష్ణ థియేటర్లలో భగవంత్ కేసరిగా గర్జించేందుకు రెడీ అవుతున్నాడు. ఆయన నటించిన భగవంత్ కేసరి అక్టోబర్ 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లకి రాబోతుంది. ఈ సినిమాకు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటించగా... టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ హీరోయిన్ శ్రీలీల ఆయన కూతురి పాత్రలో నటిస్తుంది. ఇక ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ బాణీలు అందిస్తున్నాడు.

ఇక భగవంత్ కేసరి సినిమా రిలీజ్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇప్పటికే గణేష్ అంథేం రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక రెండో పాటను కూడా రిలీజ్ చేయగా.. దానికి కూడా మంచి ఆదరణ వస్తోంది. ఇప్పుడు మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు మొదలు పెట్టారు. ఇక ఈ మూవీ ట్రైలర్ సూపర్ స్టార్ మహేశ్ బాబు చేతుల మీదుగా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు మహేశ్ ఫ్యాన్స్ కూడా జోడైతే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రచ్చ చేయడం ఖాయం అంటున్నారు.
బాలయ్య నటిస్తున్న భగవంత్ కేసరి సినిమా ట్రైలర్ ను అక్టోబర్ 8న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే తాజాగా ట్రైలర్ టైం లాక్ కూడా ఫిక్స్ చేశారు. అక్టోబర్ 8వ తేదీన రాత్రి 8 గంటల 16 నిమిషాలకు విడుదల కానున్నట్లు మూవీ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ తో ప్రకటించారు. అయితే ఈ పోస్టర్ లో లాక్ట్ అండ్ లోడెడ్ అంటూ ఓ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇక ఈ పోస్టర్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి విక్టరీ సింబల్ ని చూపిస్తూ... బ్యాక్ సైడ్ లో ఓ పాప బొమ్మతో పాటు ప్రపంచ గ్లోబ్ ని చూపించారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉండబోతుందో బయటకు వచ్చేసింది. ఈ ట్రైలర్ నెవర్ బిఫోర్ అన్నట్లు కట్ చేసినట్లు ఇన్ సైడ్ వర్గాల సమాచారం. మొత్తానికి భగవంత్ కేసరి ట్రైలర్ చూస్తే.. బాలయ్య ఫ్యాన్స్ కే కాదు.. అందరికీ గుస్ బంప్స్ అని తెలుస్తోంది. ఇక ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతాయని సమాచారం. ఇక ఇందులో బాలయ్యను మునుపెన్నడూ చూడని అవతారంలో చూస్తారని అంటున్నారు.

ఇక భగవంత్ కేసరి సినిమాకు తమన్ అందించిన మ్యూజిక్, బీజీఎం అయితే అల్టిమేట్ అని సమాచారం. ఇప్పటికే వీరి కాంబోలో అఖండ, వీర సింహరెడ్డి సినిమాలు వచ్చాయి. ఇక వాటికి ఏ రేంజులో తమన్ బీజీఎం ఇచ్చాడో తెలిసిందే. తమన్ మార్క్ మరోసారి రిపీట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక ట్రైలర్ చూశాక ఈ సినిమాపై భారీ అంచనాలు, ప్రీ బుకింగ్స్ పెరుగుతాయని ఇన్ సైడ్ వర్గాల సమాచారం. ఇక ఈ సినిమాను సైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











