Don't Miss!
- Sports IPL 2024: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. విధ్వంసకర బ్యాటర్ దూరం!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్‌పై కేసు నమోదు
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
చిరంజీవి అల్లుడి కోసం బాలయ్య వస్తున్నాడా!
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం విజేత. డెబ్యూ దర్శకుడు రాకేష్ శశి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశాయి. శుక్రవారం రోజు విడుదలైన చికెన్ సాంగ్ మాస్ ప్రియులని ఆకట్టుకుంటోంది.
విజేత ఆడియో వేడుక ఈ నెల 24 న వైభవంగా జరగనుంది. తాజాగా జరుగుతున్న ప్రచారం సినీవర్గాల్లో చర్చనీయాంశగా మారింది. ఆడియో వేడుకకు మెగాస్టార్ చిరు అతిధిగా హాజరు కానున్నారు. అల్లుడి చిత్రం కాబట్టి ఇందులో పెద్ద విశేషం లేదు. కానీ బాలయ్య కూడా హాజరు కానున్నాడని ఇండస్ట్రీ వర్గాలు కోడై కూస్తున్నాయి.
విజేత చిత్రం ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి బ్యానర్ లో నిర్మించబడుతోంది. ఆ సంస్థతో ఉన్న అనుబంధంతోనే బాలయ్య ఈ వేడుకకు అతిధిగా హాజరుకాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. చిత్ర యూనిట్ ఈ వార్తపై అధికారికంగా ప్రకటన చేయవలసి ఉంది.