ఏంటి.. 'భగవంత్ కేసరి'.. ఆ బాలీవుడ్ మూవీ ఆధారంగా తీస్తున్నారా?.. బాలయ్య బాబు ఇది నిజమేనా?
ఫన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా భగవంత్ కేసరి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. భారీ బడ్జెట్ సినిమాగా వస్తోంది. అయితే ఈ చిత్రం గురించి ఓ షాకింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రాన్ని ఓ బాలీవుడ్ హిట్ సినిమా ఆధారంగా తీస్తున్నారని తెలిసింది. వివరాళ్లోకి వెళితే..
60ఏళ్ల వయసులోనూ ఫుల్ జోష్ గా: నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ వైపు సినిమాలు మరోవైపు రాజకీయాలు, సామాజిక సేవా కార్యక్రమాలు.. ఇంకోవైపు క్యాన్సర్ హాస్పిటల్ వ్యవహారాలు, ఓటీటీ అన్ స్టాపబుల్ టాక్ షో.. ఇలా కెరీర్ లో గ్యాప్ లేకుండా బిజీగా గడుపుతున్నారు. 60ఏళ్ల వయసులోనూ ఫుల్ జోష్ తో ముందుకెళ్తూ అభిమానుల్ని, సినీ ప్రియులన్ని అలరిస్తున్నారు. ప్రజల మనసులను గెలుచుకుంటున్నారు.

సినిమాల విషయానికొస్తే: వరుసగా రెండేళ్లలో 'అఖండ', 'వీరసింహారెడ్డి' అంటూ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను దక్కించుకున్నారు బాలకృష్ణ. ప్రస్తుతం ఫన్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో 'భగవంత్ కేసరి' అనే ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రంలో నటిస్తున్నారు. I Don't Care ట్యాగ్ లైన్. ఈ సినిమాలో బాలయ్య సరసన మొదటిసారి గ్లామర్ బ్యూటీ కాజల్ అగర్వాల్ నటిస్తోంది.
బాలయ్య భార్య పాత్రలో కనిపించనుందని టాక్. ఇకపోతే టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల.. మరో కీలక పాత్రలో నటించనుంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ గా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహూ గారపాటి - హరీష్ పెద్ది కలిసి ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

ఆ బాలీవుడ్ సినిమా ఆధారంగా: ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. తెలంగాణ యాసలో బాలయ్య బాబు తన డైలాగ్ లు, యాక్టింగ్ తో అదరగొట్టేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని ఓ బాలీవుడ్ మూవీ ఆధారంగా తీసుకుని తెరకెక్కిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. గతంలో 1992లో బాలీవుడ్ లో వచ్చిన ఖుదా గవా సినిమా ఎంతగా హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమాకు భగవంత్ కేసరికి దగ్గరి పోలికలు ఉన్నట్లు సమాచారం అందింది.

ఇదేనా కథ: ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్.. ప్రేయసికి ఇచ్చిన మాట కోసం, ఫ్రెండ్ కోసం శత్రువుని చంపి జైలుకు వెళ్తారు. అలానే అతనెవరో తెలియకుండానే ఆయన కూతురు మరోచోట పెరుగుతూ ఉంటుంది. ఈ సినిమాలో నాగార్జున కూడా నచించారు. అందాల తార శ్రీదేవి కూడా ఇందులో నటించారు. అయితే కాస్త అటు ఇటుగా ఇలాంటి కథే భగవంత్ కేసరిలోనూ కనిపిస్తుందని కథనాలు వస్తున్నాయి. మరి ఇందలో నిజమెంతో తెలియదు. సినిమా రిలీజ్ అయ్యేంతవరక వేచి ఉండాల్సిందే.
ఏకంగా ఫ్లోర్ స్టెప్: ఇకపోతే ఇటీవలే ఈ సినిమా గురించి ఓ వార్త బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య బాబుకు అదిరిపోయే స్టెప్పులు పెట్టారని ప్రచారం సాగింది. ఇప్పటికే ఆయన 'లెజెండ్', 'అఖండ', 'వీర సింహా రెడ్డి' చిత్రాల్లో అదిరిపోయే స్టెప్పులతో అభిమానుల్ని అలరించారు. ఇప్పుడు 'భగవంత్ కేసరి'లోనూ ఓ పాటలో బాలయ్య ఏకంగా ఫ్లోర్ స్టెప్ వేయబోతున్నారని వార్తలు వచ్చాయి. పది రోజుల పాటు బాలయ్య ప్రాక్టీస్ కూడా చేశారట.


Click it and Unblock the Notifications











