twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్: బాలకృష్ణ నడిపిన బైక్ ఆక్షన్

    By Srikanya
    |

    హైదరాబాద్ : సెలబ్రేటీలు...ముఖ్యంగా సినీ స్టార్స్ వస్తువులు ఆక్షన్ వేయటం కామనే. తాజాగా బాలకృష్ణ నడిపిన బైక్ వేలానికి రానుందని సమాచారం. ఆయన తాజా చిత్రం లెజండ్ లో వాడిన బైక్ ని వేలానికి పెట్టనున్నారని చెప్తున్నారు. అనేక ప్రత్యేకలతో ఈ బైక్ ని బోయపాటి శ్రీని డిజైన్ చేయించారు. అయితే షూటింగ్ పూర్తయ్యాక ఈ ఆక్షన్ జరుగుతుందని అంటున్నారు. నందమూరి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ ఈ ఆక్షన్ కి వస్తుందని వినికిడి. ఈ బైక్ ని ఇరవై లక్షల రూపాయలతో రూపొందించారని చెప్తున్నారు.

    ఇక ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఆర్.ఎఫ్.సి లో జరుగుతోంది.వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బాలయ్య సరసన రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు విలన్ పాత్రలో కనిపిస్తారు. పూర్తి కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సామాజిక అంశాలకు పెద్ద పీట వేసారు దర్శకుడు బోయపాటి శ్రీను. దర్శకుడు బోయపాటి ఈ చిత్రాన్ని బాలయ్య రాజకీయ భవిష్యత్‌కు ఉపకరించేలా రూపొందిస్తున్నాడట. బాలయ్య అభిమానులను, తెలుగు దేశం పార్టీలను అలరించేలా సినిమాలో డైలాగులు ఉంటాయని, కొన్ని సన్నివేశాలు కూడా బాలయ్య అభిమానుల్లో జోష్ నింపే విధంగా ఉంటాయని టాక్.

    ఈ చిత్రంలో బాలకృష్ణ సరికొత్తగా కనిపిస్తారు. ఆయన కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన బుల్లెట్ బైక్, సఫారీ కారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సినిమా షూటింగ్ మొత్తాన్ని సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం, అందుకు బాలకృష్ణ కూడా ఎంతగానో సహకరిస్తున్నారని చిత్ర నిర్మాతలు తెలిపారు. దర్శకుడు బోయపాటి మాట్లాడుతూ...'ఈచిత్రంపై అభిమానులకు భారీ అంచనాలు ఉండటం సహజం. వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గని విధంగా ఈచిత్రం రూపుదిద్దుకుంటోంది' అన్నారు.

    English summary
    Balakrishna's upcoming entertainer ‘Legend’ is attracting the attention of all for the specially designed bike. The bike has many specialties. According to the latest, film makers are planning to place the bike for auction after the completion of shooting. Currently film is progressing in RFC,Hyd.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X