రాంచరణ్ సంక్రాంతికి.. బాలయ్య దసరాకి!
నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. క్రిష్ జాగర్లమూడి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. బాలయ్య రాజకీయాల్లో బిజీగా ఉంటున్నా సినిమాల జోరు మాత్రం తగ్గించడం లేదు. కుర్రాళ్లతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం తరువాత బాలయ్య నటించే సినిమాల గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. వివి వినాయక్ దర్శత్వంలో, బోయపాటి దర్శత్వంలో అంటూ ప్రచారం జరుగుతోంది.

క్రేజీ కాంబినేషన్
బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే నందమూరి అభిమానుల్లో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోవడం ఖాయం. ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్ లో సింహా, లెజెండ్ అనే సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఎలాంటి సింహా ముందు వరకు బాలయ్య నటించిన చాలా చిత్రాలు నిరాశపరిచాయి. కానీ బోయపాటి సింహా చిత్రంలో బాలయ్యని పవర్ ఫుల్ గా ప్రెజెంట్ చేసి నందమూరి ఫ్యాన్స్ ని ఖుషి చేశాడు. ఆ తరువాత వచ్చిన లెజెండ్ చిత్రం కూడా సూపర్ హిట్ గా నిలిచింది.

వినయ విధేయ రామ
ప్రస్తుతం బోయపాటి శ్రీను మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో వినయ విధేయ రామ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండు పాటల మినహా వినయ విధేయరామ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ చిత్రం విడుదల తరువాత బోయపాటి తీరిక పడనున్నాడు. ఆ తరువాత బాలయ్యతో తెరకేకించే చిత్రంపై దృష్టి పెడతాడని సమాచారం.

మార్చి నుంచి
ఇప్పటికే బాలయ్య కోసం సిద్ధం చేసి ఉన్న కథకు తుదిమెరుగులు దిద్ది మార్చి నుంచి సినిమాని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఆ లోపు బాలయ్య నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలూ విడుదలైపోతాయి. హీరోలని పవర్ ఫుల్ గా చూపించడంలో బోయపాటి శ్రీను ఆరితేరిపోయారు. ఆయన సినిమాలన్నీ గమనిస్తే ఊరమాస్ అనిపించే యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. మాస్ ప్రేక్షకులు బోయపాటి చిత్రాలని ఇష్టపడేది అందుకే.

దసరా కానుకగా
బోయపాటి శ్రీను తన చిత్రాల్ని వేగంగా చిత్రీకరిస్తారు. మార్చిలో బాలయ్య చిత్రాన్ని మొదలు పెట్టి దసరాకు విడుదల చేయాలనేది ప్లాన్. ఈ చిత్రంలో బాలయ్య సరసన నటించే హీరోయిన్లు ఎవరు.. సంగీతం దర్శకుడు లాంటి విషయాలన్నీ త్వరలో తెలియనున్నాయి. బహుశా వినయ విధేయరామ చిత్రం విడుదలయ్యాక ఈ చిత్రం గురించి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











