షాకిస్తున్న బాలయ్య, బోయపాటి సినిమా లెక్క.. బడ్జెట్ ఎంతో తెలుసా!
Recommended Video

బాలకృష్ణ, బోయపాటి శ్రీను సూపర్ హిట్ కాంబినేషన్ ఇప్పటికే రెండు చిత్రాలు వచ్చాయి. మూడవ చిత్రం కూడా రెడీ అవుతోంది. సింహా, లెజెండ్ రెండు చిత్రాలు సూపర్ హిట్ కావడం విశేషం. పరాజయాల్లో ఉన్న బాలయ్యకు చాలా కాలం తరువాత సింహా రూపంలో విజయం దక్కింది. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో రాబోతున్న మూడవ చిత్రం గురించి అభిమానులు ఇప్పటి నుంచే ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

ఎన్టీఆర్ బయోపిక్ తో బిజీగా
బలకృష్ణ ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఈ చిత్రం దాదాపు 80 కోట్ల పైగా బడ్జెట్ తో రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి బాలయ్య తన మార్కెట్ పరిథి పెంచాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

బోయపాటి సినిమాలు
బోయపాటి సినిమాలు ఎక్కువగా మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంటాయి. ఇక నుంచి మా స్ ఆడియన్స్ తో పటు ఓవర్సీస్ ఆడియన్స్ ని కూడా టార్గెట్ చేసేలా సినిమాలు తీయాలని బోయపాటి నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకోసం తన చిత్రాల బడ్జెట్ పెంచడానికి కూడా బోయపాటి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

100 కోట్ల బడ్జెట్
ఈ నేపథ్యంలో బాలయ్యతో తెరకెక్కించే సినిమా విషయంలో బోయపాటి ప్రాధమికంగా 100 కోట్ల బడ్జెట్ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. బాలయ్య కూడా తన అంగీకారాన్ని తెలిపాడట.

రాంచరణ్ సినిమాతో
బోయపాటి ప్రస్తుతం రాంచరణ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అదే సమయంలో బాలయ్య చిత్రానికి కథ కూడా సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం పూర్తయ్యాక వీరి కాంబినేషన్ లో మూవీ ప్రారంభం అవుతుంది.


Click it and Unblock the Notifications











