టైటిల్ విషయమై బాలకృష్ణ సూచన
హైదరాబాద్: 'లెజెండ్'తో అభిమానుల్ని అలరించారు నందమూరి బాలకృష్ణ. ఆయనకు సరైన కథ పడితే ఎలా ఉంటుందో ఈ విజయం నిరూపించింది. మరోసారి తన శైలికి సరితూగే కథలో కనిపించబోతున్నారు. బాలకృష్ణ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి 'వారియర్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే గాడ్సే, వారియర్ వంటి ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టవద్దని బాలయ్య సూచించినట్లు సమాచారం. ఇంతకన్నా మంచి టైటిల్ ని వెతకమని చెప్పినట్లు సమాచారం. అయితే మరో మంచి తెలుగు టైటిల్ ని ఇంకా దర్శకుడు చెప్పలేదని, చెప్పాక..బాలయ్య ఓకే చేసి అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.
త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్స్. సత్యదేవా దర్శకత్వం వహిస్తున్నారు. రుద్రపాటి రమణారావు నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో పోరాట సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. వీటికి రామ్‌లక్ష్మణ్ నేతృత్వం వహిస్తున్నారు. రెండు రోజుల పాటు ఇక్కడే యాక్షన్ ఎపిసోడ్ తెరకెక్కిస్తారు. ఆ తరవాత వారం రోజుల పాటు హైదరాబాద్‌లోనే చిత్రీకరణ సాగుతుంది. ఈ చిత్రంలో బాలయ్యలో రెండు కోణాలుంటాయని తెలుస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

''ప్రజల క్షేమాన్ని కోరుకునే ఓ ఉన్నత ఉద్యోగి జీవితమిది. నాయకుడంటే ఇలా ఉండాలనేలా బాలకృష్ణ పాత్రను సత్యదేవా తీర్చిదిద్దారు. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉంటాయి'' అంటున్నారు నిర్మాత.
ఈ చిత్రంలో బాలకృష్ణ సీబీఐ ఆఫీసర్ గా కనిపించనున్నారని సమాచారం. నీతి, నిజాయతీలను ప్రాణంగా భావించే ఆయన కథ ఇది. ఆయన సమాజానికి మంచి చేయాలనే సంకల్పంతో ఓ కేసు విషయంలో అవినీతి పరుల కు వ్యతిరేకంగా పోరాడి...నాయకుడిలా మారి అక్రమార్కుల గుండెల్లో గుబులు రేకెత్తిస్తారు. కథలో మలుపులు ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తాయి.
ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, జయసుధ, అలీ, గీత, చంద్రమోహన్ తదితరులు నటిస్తున్నారు. చిత్రానికి ఛాయాగ్రహణం: వెంకట్‌ప్రసాద్, కూర్పు: గౌతంరాజు


Click it and Unblock the Notifications











