»   »  కళ్యాణ్ రామ్ లెజెండ్ వ్యాఖ్య పై బాలయ్య ఆగ్రహం..??

కళ్యాణ్ రామ్ లెజెండ్ వ్యాఖ్య పై బాలయ్య ఆగ్రహం..??

Posted By:
Subscribe to Filmibeat Telugu

అమెరికాలో జ‌రిగిన‌ తానా ఉత్సవాల్లో ఎన్టీఆర్ పేరిట ఇస్తున్న అవార్డ్స్ వేడుక‌కు హాజ‌రైన కల్యా‌ణ్ రామ్ కు నంద‌మూరి అభిమానులు ఘ‌నంగా స్వాగతం పలికారు. ఆ స‌మ‌యంలో వారు జూనియ‌ర్ ఎన్టీఆర్ గురించి ఒక్క మాట‌లో చెప్ప‌మ‌ని కల్యాణ్ రామ్‌ను కోరారు. దానికి స‌మాధానంగానే క‌ల్యాణ్ రామ్.. ఆటం బాంబ్ అని చెప్పాడ‌ట‌.

సీనియర్ ఎన్టీఆర్ కి మాత్రమే వాడండి

సీనియర్ ఎన్టీఆర్ కి మాత్రమే వాడండి

అదే సందర్భంలో ఓ అభిమాని నినాదాలు చేస్తూ జూనియర్ ఎన్టీఆర్‌ను లెజెండ్ అంటూ సంబోధించాడట. ఆ నినాదం కల్యా‌ణ్ రామ్ చెవిన పడటంతో అలా పిలవొద్దని చెప్పాడట. లెజెండ్ అనే పదం పెద్దవాళ్లను ఉద్దేశించి వాడతారని, తన తమ్ముడు ఇంకా చిన్నవాడేనని చెప్తూనే సీనియర్ ఎన్టీఆర్ కి మాత్రమే వాడండి అన్నట్టు ఒక మాట చెప్పాడట. అయితే ఈ విషయం లో బాలయ్య కొంత అసహనం ఫీలయ్యాడన్న మాట ఇప్పుడు ఫిలిం నగర్ లో వినిపిస్తోంది.

లెజెండ్ అన్న పదం

లెజెండ్ అన్న పదం

అయితే ఇప్పుడు ఇదే విశయం పై ఇంకో చిన్న సంఘటన చోటు చేసుకుందని సమాచారం... లెజెండ్ అన్న పదం కేవలం పెద్ద ఎన్టీఆర్‌కి మాత్రమే ఉపయోగించాలని కళ్యాణ్ రామ్ కామెంట్స్ చేసిన నేపథ్యంలో అసలు ఎందుకు అలాంటి టాపిక్స్ టచ్ చేస్తున్నారు అని కళ్యాణ్ రామ్‌తో బాలయ్య అన్నట్టుగా తెలుస్తోంది.

లెజెండ్ బాలయ్య

లెజెండ్ బాలయ్య

కాసింత కోపంగానే మాట్లాడిన బాలయ్య.....అనవసరమైన టాపిక్స్ ఎందుకు టచ్ చేస్తావు అని చెప్పాడట. లెజెండ్ అన్న పేరుతో బాలయ్య సినిమా కూడా చేసి ఉన్నాడు. అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా బాలయ్యను చాలా మంది లెజెండ్ బాలయ్య అని అంటూ ఉంటారు.

లెజెండ్ అనే పదం

లెజెండ్ అనే పదం

అలాంటి పరిస్థితుల నేపథ్యంలో లెజెండ్ అనే పదం ఎన్టీఆర్‌కి తప్ప ఇంకెవ్వరికీ ఉపయోగించొద్దు అనే అర్థం వచ్చేటట్టు మాట్లాడటం పై నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ నుంచే డిఫరెంట్ కామెంట్స్ వినిపిస్తున్నాయని తెలుస్తోంది.నందమూరి క్లోజ్ సర్కిల్స్ నుంచి ఈ సమాచారం అందుతోంది.

ఎన్టీఆర్‌కి టిడిపిలో ప్రాధాన్యత

ఎన్టీఆర్‌కి టిడిపిలో ప్రాధాన్యత

బాలకృష్ణ కూతురిని లోకేష్ వివాహం చేసుకున్న తర్వాత నుంచీ బాలయ్యకు హరికృష్ణ కుటుంబ సభ్యులకు మధ్య కాస్త గ్యాప్ పెరిగిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌కి టిడిపిలో ప్రాధాన్యతను ఇవ్వాలన్నది హరికృష్ణ అభిమతం. టిడిపి మళ్ళీ నందమూరి వారి చేతుల్లోకి రావాలని కోరుకునే వాళ్ళలో .

హరికృష్ణ-బాలకృష్ణ

హరికృష్ణ-బాలకృష్ణ

హరికృష్ణ, ఎన్టీఆర్‌లు ముందుంటారనీ., ఆంధ్ర ప్రదేశ్ సీయెం చంద్రబాబు కూడా అందుకే వీళ్ళను దూరం పెట్టేస్తూ ఉంటారు అనీ. ఈ నేపథ్యంలో హరికృష్ణ-బాలకృష్ణ కుటుంబాల మధ్య కూడా సంబంధాలు బాగా సెన్సిటివ్‌గా మారిపోయాయి అంటూ కొన్ని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అయితే ఈ సమాచారాల్లో ఎవ్వరికీ పక్కా క్లారిటీ మారం లేదు.

English summary
“While praising Junior NTR, please do not use word ‘legend’. It is suitable only for Man of the Age Nandamuri Taraka Ramarao.” said Kalyan Ram in a public function at America. But as per report Nandamuri Balayya fires on Kalyan Ram about those words
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu