అక్కినేని మృతి:బాలకృష్ణ ఎందుకు రాలేదు?

By Srikanya

Balayya missed for homage to ANR
హైదరాబాద్ : బాలకృష్ణ ఎప్పుడు నాగేశ్వరరావు గారిని బాబాయ్ అని సంభోదిస్తూ క్లోజ్ గా ఉండేవారు. అయితే ఆయన అక్కినేని అంతిమయాత్రకు హాజరుకాకపోవటం అంతటా ఓ టాపిక్ గా నిలిచింది. ఈ విషయమై రకరకాల రూమర్స్ ప్రచారం అవుతున్నాయి. అయితే బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి వచ్చి అక్కినేని బౌతికకాయానికి నివాళులు అర్పించారు. మరోప్రక్క బాలకృష్ణ అన్న హరికృష్ణ,అల్లుడు లోకేష్,కూతురు సైతం వచ్చారు. కానీ బాలకృష్ణ రాకపోవటం అనేది ఇప్పుడు సోషల్ మీడియా వెబ్ సైట్లలో,ఛానెల్స్ లో వార్తగా ప్రచారంలోకి వెళ్తోంది.

దాదాపు ఏడున్నర దశాబ్దాలపాటు తెలుగు సినీ పరిశ్రమను ఏలిన నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావుకు అశ్రునయనాల మధ్య కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, అభిమానులు గురువారం అంతిమ వీడ్కోలు పలికారు. శోకతప్త హృదయాల మధ్య ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుతూ...కుమారులు వెంకట్‌, నాగార్జున, కుమార్తె నాగసుశీల, మనుమలు సుమంత్‌, సుశాంత్‌, నాగచైతన్య, అఖిల్‌ ఈ క్రతువును నిర్వర్తించారు. ఏఎన్నార్‌కెంతో ఇష్టమైన అన్నపూర్ణ స్టూడియో ఈ విషాద ఘట్టానికి వేదికైంది. గ్లాస్‌హౌజ్‌ పక్కనే ప్రత్యేకంగా ఘాట్‌ను ఏర్పాటు చేశారు.

భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు వాహనం నుంచి దించి పాడెపై ఉంచారు. పాడెను నాగార్జునతోపాటు ఏఎన్నార్‌ మనవళ్లు సుమంత్‌, సుశాంత్‌, నాగచైతన్య, అఖిల్‌ భుజాలపై మోశారు. తండ్రి మృత దేహాన్ని చూసి వెంకట్‌, నాగార్జున, నాగసుశీల ఒకరిని ఒకరు పట్టుకొని వెక్కివెక్కి ఏడ్చారు. పార్థివదేహాన్ని గంధపు చెక్కలపై ఉంచారు. నాగార్జున దుఃఖంతో చితి పక్కనే కొంతసేపు కూర్చుండిపోయారు. తండ్రి చితి చుట్టూ నీళ్ల కుండ పట్టుకొని తొలుత వెంకట్‌...తర్వాత నాగార్జున ప్రదక్షిణలు చేశారు. అనంతరం కుటుంబ సభ్యులంతా కలిసి అశ్రు నయనాలతో ఏఎన్నార్‌ చితికి నిప్పు అంటించారు. చితికి నిప్పు అంటించే సమయంలో గౌరవ సూచకంగా పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ప్రత్యేక పోలీసు బ్యాండ్‌ను ఏర్పాటు చేశారు.

అక్కినేని నాగేశ్వరరావు మృతితో తెలుగు చలనచిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అక్కినేని భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అక్కినేని సినీ పరిశ్రమకు అందించిన సేవలను ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌, దాసరి నారాయణరావు, పీబీ రాజేంద్ర ప్రసాద్‌, తమ్మారెడ్డి భరద్వాజ, మోహన్‌బాబు, విష్ణు, సినారె, పరుచూరి వెంకటేశ్వరరావు, రాజేంద్రప్రసాద్‌, బెనర్జీ, నన్నపనేని రాజకుమారి, శ్రీకాంత్‌, అల్లు అరవింద్‌, వెంకటేష్‌, రవితేజ, నితిన్‌, శివాజీ, కైకాల సత్యనారాయణ, చలపతిరావు, సాయికుమార్‌, ఆది, సురేష్‌బాబు, శ్యాంప్రసాద్‌రెడ్డి, రానా, ఎంపీలు లగడపాటి రాజగోపాల్‌, సీఎం రమేష్‌, ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌, చాముండేశ్వరీనాథ్‌, మంత్రి వట్టి వసంతకుమార్‌, ఎమ్మెల్యేలు జూలకంటి రంగారావు, ప్రసన్నకుమార్‌రెడ్డి, కృష్ణం రాజు దంపతులు, ఇంద్రసేనారెడ్డి తదితరులు అక్కినేని భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X