బీభత్సం సృష్టించిన సినిమాకు సీక్వెల్.. బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా!
2004 లో వచ్చిన బాలయ్య పవర్ ఫుల్ యాక్షన్ చిత్రం లక్ష్మి నరసింహాని మరిచిపోలేం. జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో ఈ చిత్రం వచ్చింది. ఈ సినిమాలో బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అదరగొట్టాడు. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించిన ఈ చిత్రం అఖండ విజయం సాధించింది. బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లలో ఒకటిగా ఈ చిత్రం నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్ చేసే ఆలోచనలో బాలయ్య ఉన్నాడా! ఈ ఆలోచన బాలయ్యకు వచ్చిందో లేదో తెలియదు కానీ నందమూరి అభిమానులు మాత్రం అదే కోరుకుంటున్నారు.

సామి రీమేక్‌గా
తమిళంలో విక్రమ్ నటించిన సామి చిత్రానికి రీమేక్ గా లక్ష్మి నరసింహ చిత్రం వచ్చింది. తమిళంలో ఎంతటి విజయం సాధించిందో అదే స్థాయిలో తెలుగులో కూడా లక్ష్మి నరసింహ విజయం సాధించింది.
సామి స్క్వేర్‌గా మారిన విక్రమ్
సామీ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన సామీ స్క్వేర్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజగా ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ ట్రైలర్ లో విక్రమ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు.

అదే విధంగా
కానీ దర్శకుడు హరి మార్క్ స్క్రీన్ ప్లే మాత్రం మారలేదని ట్రైలర్ ద్వారా అర్థం అవుతోంది. సింగం సిరీస్ లో ఉపయోగించిన మాస్ టెక్నిక్స్ నే ఈ చిత్రాల్లో కూడా దర్శకుడు ఉపయోగించాడు. కొత్తదనం ఆశించే అభిమానులకు ఇది కాస్త నిరాశ కలిగించే అంశమే.

అంచనాలు అందుకుంటుందా
సీక్వెల్ తీసి హిట్టు కొట్టడం కష్టమే. మొదటి భాగానికి మించి రెండవ భాగం ఉండాలి. కానీ సామి స్క్వేర్ లో దర్శకుడు హరి పాత కథనే ఎంపిక చేసుకున్నట్లు అర్థం అవుతోంది. విక్రమ్ రోల్ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నా సినిమా ఏ మేరకు విజయం సాధిస్తుంది అనేది విడుదల అయిన తరువాత మాత్రమే తేలనుంది.

బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా
ప్రస్తుతం బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని ఓ కొలిక్కి తీసుకువచ్చే పనిలో ఉన్నాడు. ఈ సమయంలో బాలయ్య లక్ష్మి నరసింహ 2 చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సందేహమే.


Click it and Unblock the Notifications











