రజనీ 'లింగా':బాలయ్య ఫ్లాఫ్ సినిమా స్టోరీ లైన్?
హైదరాబాద్ : సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా చిత్రానికి 'లింగా' అని పేరుపెట్టిన సంగతి తెలిసిందే. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం టైటిల్ బయిటకు రాగానే అప్పుడే తమిళ సినీ వర్గాల్లో అప్పుడే ఈ చిత్రం కథపై రకరకాల కథనాలు వెలువడటం మొదలయ్యాయి. అయితే ఆ కథనాల్లో ఆసక్తికరమైన విషయం ఏమిటీ అంటే...ఈ చిత్రం బాలకృష్ణ కెరీర్ లో డిజాస్టర్ గా నిలిచిన చిత్రం స్టోరీ లైన్ పోలి ఉంది అనేది. కేవలం ఆ స్టోరీ లైన్ మాత్రం తీసుకుని కొత్త సీన్స్ తో సినిమాని రక్తి కట్టించేలా స్క్రిప్టుని రవికుమార్ రెడీ చేసారని చెప్తున్నారు.
ఇంతకీ ఈ చిత్రం బాలకృష్ణ ఏ చిత్రానికి పోలిక అంటారా...అది..వైవియస్ చౌదరి,బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ఒక్క మగాడు. ఈ చిత్రం తరహాలోనే ఈ 'లింగా' లోనూ స్వాతంత్ర్యం రాకముందు, స్వతంత్ర్యం కోసం పరితపించి పోరాడే దేశభక్తుడుగా, వచ్చాక మారిన ఈ దేశాన్ని చూసి బాధపడి చక్కదిద్దాలనుకునే పెద్దాయనగా ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ఉండబోతోందిట. ద్విపాత్రాభినయంతో రజనీ కనిపిస్తారని, ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే క్యారెక్టర్ లుక్ అదీ అద్బుతంగా డిజైన్ చేస్తున్నారని, అదే సినిమాని నిలబెడుతుందని చెప్తున్నారు.

అలాగే దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు కొన్నిటిని ఈ సినిమాలో చర్చించే అవకాసం ఉందని అంటున్నారు. యువత రాజకీయాల్లోకి రావాలి, మార్పు తేవాలి అనే అంశంతో కథనం నడుస్తుందని అంటున్నారు. 'లింగా' అనేది ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పాత్ర పేరు అని, అలాగే ప్రారంభం నుంచి యువకుడైన రజనీ పాత్ర ఉంటుందని అంటున్నారు. ఇద్దరికి ఇద్దరు హీరోయిన్స్ ఉండనున్నారు. రజనీ సరసన అనుష్క, సోనాక్షి సిన్హా నటిస్తున్నారు. విలన్ గా జగపతిబాబు పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో కీలకమై నిలుస్తుందని చెప్తున్నారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. రాక్‌లైన్ వెంకటేష్ నిర్మాత.
ఈ సినిమా ప్రారంభోత్సవం త్వరలోనే మైసూర్‌లో జరగనున్నట్లు సమాచారం. అక్కడ భారీ సెట్‌ను రూపొందించే పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో రజనీ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. రజనీకాంత్ మనవడు (ధనుష్- ఐశ్వర్య కుమారుడు) పేరు కూడా లింగా కావడం గమనార్హం.


Click it and Unblock the Notifications











