బాలకృష్ణ కౌంటర్ కేక... అందరూ గప్ చిప్

By Srikanya

హైదరాబాద్: ఓ ప్రక్క ఆగడు టీజర్ లో మహేష్ చెప్పిన డైలాగుపై బాలకృష్ణ ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. అయితే ఈ నేపధ్యంలో బాలకృష్ణ కొత్త చిత్రం ఓపినింగ్ సందర్భంగా కొట్టిన పంచ్ డైలాగు అందరికీ సమాధానమిచ్చినట్లు అయ్యింది. స్కానింగ్,ఎక్సరే అంటూ తరుచుగా సినిమాల్లో వినిపించే డైలాగులకు పంచ్ ఇచ్చి, అన్ని టీజర్స్ కౌంటర్ ఇచ్చినట్లు అయ్యింది అంటున్నారు. దాంతో ఈ ఒక్క డైలాగుతోనే బాలకృష్ణ కొత్త చిత్రం ఓపినింగ్ అంతటా చర్చనీయాంశమైంది.

'కొందరు కొడితే ఎక్స్‌రేలో కనిపిస్తుంది. కొందరు కొడితే స్కానింగ్‌లో కనిపిస్తుంది. నేను కొడితే హిస్టరీలో వినిపిస్తుంది...'. - కొత్త సినిమా కోసం బాలకృష్ణ పలికిన సంభాషణ ఇది. బాలకృష్ణ సినిమా అంటే అభిమానులకు ముందుగా గుర్తుకొచ్చేది సంభాషణలే. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట తూటాలా దూసుకుపోతుంది. తాజాగా మరోసారి అలాంటి పదునైన సంభాషణ పలికారాయన. నందమూరి బాలకృష్ణ హీరోగా ఎస్‌.ఎల్‌.వి. సినిమా పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. త్రిష హీరోయిన్. సత్యదేవా దర్శకత్వం వహిస్తున్నారు. రుద్రపాటి రమణారావు నిర్మాత.

Balkrishna's Fitting Reply To All Teasers

దర్శకుడు మాట్లాడుతూ.... ''బాలకృష్ణగారి కోసం మూడేళ్ల కిందటే తయారు చేసుకొన్న కథ ఇది. యాక్షన్‌, వినోదంతో పాటు కుటుంబ అనుబంధాలకూ చోటుంది. తుపాకీ నుంచి దూసుకొచ్చే బుల్లెట్‌లా బాలకృష్ణ పాత్ర ఉంటుంది. తను అనుకొన్న లక్ష్యాన్ని సాధించేవరకు వెనుదిరిగి చూడని వ్యక్తిగా కనిపిస్తారు. పాత్రలో రకరకాల కోణాలుంటాయి. అవన్నీ అభిమానులకు నచ్చుతాయి. 'లెజెండ్‌'లాంటి చిత్రం తర్వాత మా కథపై నమ్మకంతో అవకాశాన్నిచ్చారు బాలకృష్ణ. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా చిత్రాన్ని తీర్చిదిద్దుతాం'' అన్నారు దర్శకుడు.

నిర్మాత మాట్లాడుతూ... ''బాలకృష్ణతో మాత్రమే తీయదగిన కథ ఇది. ఆయన విన్న వెంటనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకొన్నారు. అభిమానులకు ఏమేం కావాలో అవన్నీ ఇందులో ఉంటాయి. త్రిష, ప్రకాష్‌రాజ్‌, అలీ పాత్రలకూ ప్రాధాన్యముంది. ఈ నెల మూడో వారం నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తాము''అన్నారు నిర్మాత.

ఈ చిత్రంలో జయసుధ, గీత, చంద్రమోహన్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రానికి సంగీతం: మణిశర్మ, కూర్పు: గౌతంరాజు, ఛాయాగ్రహణం: వెంకట్‌ ప్రసాద్‌, సమర్పణ: రుద్రపాటి ప్రేమలత

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X