ఎన్టీఆర్ ఊసరవిల్లికి పోటీగా బ్రహ్మానందం 'బల్లి'
త్వరలో విడుదలకు సిద్దమవుతున్న ఎన్టీఆర్ చిత్రం ఊసరవిల్లి. ఈ చిత్రం పోస్టర్ ని స్పూఫ్ చేస్తూ బ్రహ్మానందంతో బల్లి అనే పోస్టర్ ని నెట్ లో ప్రచారం అవుతోంది. ఈ చిత్రం చూసిన వాళ్ళు చాలా మంది నవ్వుకుంటున్నారు. నిన్నటివరకూ మహేష్ దూకుడు పోస్టర్స్ ని బ్రహ్మానందంతో పాకుడు అని,నూకుడు అని ఫోటో షాప్ లో చేసిన వారు ఇప్పుడు ఈ విధంగా ఊసరవిల్లిపై పడ్డారు. అయితే ట్విస్టు ఏమిటంటే అస్సలు ఊసరవిల్లి పోస్టర్ కన్నా ఇదే బాగా ప్రాచుర్యం పొందటం.ఇక ఊసరవిల్లి సినిమాపై ఎన్టీఆర్ చాలా నమ్మకంగా ఉన్నారు. మొన్న ఆడియో పంక్షన్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ... ఈసారి మాత్రం బంతి స్టేడియం దాటుతుంది. సూరి అంత బాగా తీసాడు. ఎడిటింగ్ రూమ్ లో కూర్చుని చూసుకుంటున్నప్పుడు తను ఎంత బాగా తెరకెక్కించాడో అర్దమైంది. నేను నా భాధ్యతగా కొత్త తరహా సినిమా చేసా. ఆదరించే భాధ్యత అభిమానులదే.
అలాగే గతంలో నేను నటించిన సినిమాల్లో ఒక చిన్న మార్పు కూడా చెప్పకుండా ఓకే చేసిన కథలు ఆది, సింహాద్రి, ఇప్పుడు ఊసరవిల్లి మూడోది అంటూ ఎమోషనల్ గా మాట్లాడారు ఎన్టీఆర్. కిక్' వంటి సూపర్ హిట్ తర్వాత సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, కిక్ శ్యామ్, తనికెళ్ల భరణి, ఆద్విక్ మహాజన్, మురళీశర్మ, ఆహుతి ప్రసాద్, రెహమాన్, జయప్రకాశ్‌రెడ్డి, రఘుబాబు, అజయ్, ఎమ్మెస్ నారాయణ, పాయల్ ఘోష్, దువ్వాసి మోహన్, రఘు కారుమంచి, జీవీ, విద్యుత్ జమ్వాల్, బెనర్జీ తారాగణమైన ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, మాటలు: కొరటాల శివ, పాటలు: రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరామ్, చంద్రబోస్, సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్, యాక్షన్: రామ్-లక్ష్మణ్, కళ: రవీందర్, లైన్ ప్రొడ్యూసర్: చక్రవర్తి రామచంద్ర, సమర్పణ: బి. బాపినీడు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురేందర్ రెడ్డి.


Click it and Unblock the Notifications











