పవన్ కళ్యాణ్ కోసం బండ్లగణేష్ వరుస మీటింగ్స్.. ఆ కథ ఎంతవరకు వచ్చిందంటే?

గబ్బర్ సింగ్ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న బండ్ల గణేష్ ఆ తరువాత వరుసగా అగ్ర హీరోలతో సినిమాలు చేసిన విషయం తెలిసిందే. ఇక చాలా కాలం తరువాత పవన్ కళ్యాణ్ తో మరో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆంజనేయులు సినిమాతో నిర్మాతగా కెరీర్ ను స్టార్ట్ చేసిన బండ్ల గణేష్ అనంతరం తీన్ మార్ సినిమాను భారీగానే ప్రొడ్యూస్ చేశాడు.

అయితే మొదటి రెండు సినిమాలు అంతగా ఆడకపోవడంతో పవన్ కళ్యాణ్ ఇంకాస్త ఫోకస్ పెట్టి గబ్బర్ సింగ్ చేశాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో చేసిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. దీంతో బండ్ల గణేష్ బ్రాండ్ టాలీవుడ్ లో ఒక్కసారిగా పెరిగిపోయింది. అనంతరం బాద్షా - ఇద్దరమ్మాయిలు అనే సినిమాలు చేశాడు. అవి అంతగా లాభాలను అంధించలేదు. ఇక గోవిందుడు అందరివాడేలే - టెంపర్ సినిమాలతో మళ్ళీ కాస్త ఫామ్ లోకి వచ్చిన అనంతరం పలు ప్రాజెక్టులపై చర్చలు జరిపారు గాని ఏవి కూడా పట్టాలెక్కలేదు.

Bandla ganesh back to back meetings for pawan kalyan project

ఇక ఫైనల్ గా మళ్ళీ పవర్ స్టార్ సినిమాతోనే బౌన్స్ బ్యాక్ అవ్వాలని బండ్ల గణేష్ డిసైడ్ అయ్యాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయితే నాలుగు సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇక ఆ తరువాత గాని మధ్యలో ఎప్పుడైనా గాని బండ్ల గణేష్ తో సినిమా చేయవచ్చట. ఇక ఇటీవల ఒక సీనియర్ దర్శకుడితో ఒక మాస్ సినిమాపై చర్చలు జరిపిన బండ్ల గణేష్ మొదట బాగానే ఇంట్రెస్ట్ చూపినప్పటికి ఫైనల్ స్క్రిప్ట్ కు వచ్చేసరికి అంతగా నచ్చలేదట.

దీంతో ఆ సీనియర్ దర్శకుడిని రిజెక్ట్ చేసినట్లు టాక్ అయితే వస్తోంది. అలాగే సీనియర్ రచయితలను కూడా సంప్రదిస్తున్న బండ్ల గణేష్ ఫైనల్ కథ సెట్టయిన తరువాతే పవన్ కళ్యాణ్ వద్దకు వెళతాడట. కథతోనే సినిమా సగం హిట్టవ్వాలి అనుకుంటున్నాడట. మరి వారికి సెట్టయ్యే కథ ఎప్పుడు దొరుకుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X