Don't Miss!
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మొత్తం తీసేసినా ఫీలయ్యేవాడిని కాదంటూ.. దర్శకుడిపై బండ్ల గణేష్ ఫైర్
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినీ ప్రయాణం మొదలుపెట్టి.. హాస్య నటుడిగా ఎదిగి.. బడా ప్రొడ్యూసర్‌గా కొత్త అవతారమెత్తి స్టార్ హీరోలతో సినిమాలను నిర్మించాడు బండ్ల గణేష్. అక్కడి వరకు ఆయన పరిస్థితి, స్థితి అంతా బాగానే ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం చేయడం, టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేయడం, గొప్పలకపోయి మీడియా ముందే రెచ్చిపోవడం, గొంతు కోసుకుంటానని చెప్పడం లాంటి ఘటనలతో బండ్ల గణేష్ ఫుల్ ఫేమస్ అయ్యాడు.
గ్యాప్ తరువాత సినిమాల్లో..
రాజకీయాల్లో దిగిన బండ్ల గణేష్‌కు పెద్ద షాకే తగిలింది. అన్నీ వదిలేసి తన మానాన తాను వ్యాపారాలు చేసుకుంటూ ఉంటే పట్టుబట్టి మరి సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చేలా చేశాడు అనిల్ రావిపూడి. తన క్యారెక్టర్ అద్భుతంగా ఉంటుందని ఆకాశానికెత్తేశారు. అయితే తీరా చూస్తే పరిస్థితి తారుమారైంది.
తేలిపోయిన పాత్ర..
సరిలేరు నీకెవ్వరు సినిమా చూసిన వారెవ్వరైనా.. బండ్ల గణేష్ ఇలాంటి పాత్ర ఎందుకు చేశాడా? అని అనుకుంటారు. మరీ అంత తక్కువ నిడివి ఉండటం, పోనీ అది కూడా పూర్తి స్థాయిలో హ్యాస్యాన్ని పండించకపోవడంతో బండ్ల గణేష్‌కు ఎదురుదెబ్బ తగిలింది.
బంధువుల ప్రశ్నలు..
సరిలేరు సినిమాలో బండ్ల పాత్ర చాలా దారుణంగా వుందన్న కామెంట్లు అన్ని చోట్లా వినిపించాయి. దీంతో బండ్లగణేష్ చాలా డీలా పడిపోయినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా చుట్టాలు, స్నేహితులు ప్రతి ఒక్కరూ ఆ క్యారెక్టర్ చూసి కామెంట్లు చేస్తున్నారట.
Recommended Video
డైరెక్టర్‌పై ఫైర్..
ఈ ఘటనలతో ఫ్రస్టేట్ అయిన బండ్ల గణేష్ .. దర్శకుడు అనిల్ రావిపూడి మీద అగ్గిమీద గుగ్గిలమవుతున్నాడట. అంతే కాదు అనిల్ రావిపూడి మీద నానా శాపనార్థాలు కూడా పెడుతున్నాడట. అనిల్ రావిపూడి చేసిన పని వల్ల తన పరువుపోయిందని, అమ్మ నాన్నల దగ్గర, అన్న, బంధువుల దగ్గర కూడా తలెత్తుకోకుండా చేసాడని బండ్ల వాపోతున్నాడట. తొంభైశాతం క్యారెక్టర్‌ను తీసేసే ఉద్దేశం వున్నపుడు, మొత్తం తీసేసినా తాను బాధపడేవాడిని కాదని అందరి దగ్గర చెప్పుకుని బాధ పడుతున్నాడట.