సీక్రెట్ గిప్ట్ ఇచ్చి మ్యానేజ్ చేసాడట
హైదరాబాద్ : వివాదాలను పెద్దవి కాకుండా ఆదిలోనే తుంచేయాలనుకుంటారు సినిమావాళ్లు. తాజాగా బండ్లగణేష్, నటుడు రాజ్ కిరణ్ మధ్య వివాదం మొదలయ్యే అవకాసం కనిపించిందిట. అయితే గణేష్ తన చాతుర్యంతో మ్యానేజ్ చేసి, ఓ సీక్రెట్ గిప్ట్ తో దాన్ని పెద్దది కాకుండా, మీడియాకు ఎక్కకుండా ఆపు చేసాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అంతేకాకుండా మీడియాలో చెప్పుకుటున్నట్లుగా రెమ్యునేషన్ ని తిరిగి ఇవ్వమని అడగలేదని తెలుస్తంది. ముఖ్యంగా గణేష్ ...సీక్రెట్ గిప్ట్ లతో నటీ,నటులను,దర్శకులను పడేయటంలో ఆరితేరినవాడన్న సంగతి తెలిసిందే. ఇంతకీ వివాదం ఏమిటీ అంటే...
బండ్ల గణేష్ తాజా చిత్రం గోవిందుడు అందరి వాడేలే కోసం... రాజ్ కిరణ్ డేట్స్ తీసుకుని షూట్ చేసారు. అయితే ఇప్పుడు ఆ షూట్ చేసిన భాగం పనికిరాదని ప్రక్కన పెట్టి ఆ ప్లేస్ లోకి ప్రకాష్ రాజ్ ని తీసుకువచ్చారు. చిరంజీవి వల్లే ఈ మార్పులు జరిగాయని చెప్పుకుంటున్నా, అదేమీ లేదు కేవలం నేటివిటీ సమస్యతోనే ఈ మార్పు చేయాల్సి వచ్చిందని గణేష్...మీడియాతో చెప్పాడు కూడా. ఈ నేపధ్యంలో తనని తీసేయటంతో మండిపడ్డ రాజ్ కిరణ్...నటీనటుల సంఘానికి పిర్యాదు చేయబోయారట. విషయం తెలుసుకున్న గణేష్ ...వెంటనే యాక్షన్ లోకి దిగి...సర్దుబాటు చేసాడని చెప్పుకుంటున్నారు.

బండ్ల గణేష్ మాట్లాడుతూ... "ఇందులో హీరో తాత పాత్రకు ముందు రాజ్‌కిరణ్‌ను తీసుకుని 20 రోజులు షూటింగ్ కూడా చేశాం. రషెస్ చూసుకుంటే ఎక్కడో తెలుగుదనం కొరవడినట్లు కనిపించింది. వెంటనే ఆ పాత్రకోసం ప్రకాష్‌రాజ్‌ని తీసుకున్నాం. మా సినిమాను అక్టోబర్ 1న విడుదల చేస్తాం. అమ్మలాంటి కమ్మనైన సినిమా. నా సంస్థ ప్రతిష్ట పెంచుతుంది. సకుటుంబసపరివార సమేతంగా చూసేలా ఉంటుంది. రాబోయే పది తరాలు గుర్తుంచుకుంటాయి. ఈ సినిమాను నిర్మిస్తున్నందుకు నా కుటుంబం అంతా సంతోషపడుతోంది అన్నారు.
అలాగే... " బౌండెడ్ స్క్రిప్ట్‌తోనే సినిమాను మొదలుపెట్టాం. 100 రోజులు షూటింగ్ అనుకున్నది కాస్తా ఈ మార్పుల వల్ల 108 రోజులవుతోంది. వచ్చేనెలాఖరు వరకు ఇక్కడ షూటింగ్ చేస్తాం. ఆగస్ట్ 1 నుంచి 15 వరకు లండన్‌లో చిత్రీకరిస్తాం. యువన్ సంగీతంలో మూడు పాటలు పూర్తయ్యాయి. ఇప్పుడో మాంటేజ్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నాం'' అని అన్నారు.
ఇక "దాదాపు 60 మంది పిల్లలతో మండుటెండల్లో షూటింగ్ చేయడం ఇష్టం లేక ఓ నెల రోజులు వాయిదా వేశాం. మా హీరోగారికి జ్వరం రావడంతో 10 రోజులు షూటింగ్ చేయలేదు. చిరంజీవిగారు రషెస్‌ను ఇంత వరకు చూడలేదు. కథ విన్నారంతే. ఈ సినిమాలో తాత పాత్ర చాలా కీలకమైంది. ఒక రకంగా ఎస్వీ రంగారావుగారు, అక్కినేని నాగేశ్వరరావుగారు చేయాల్సిన పాత్ర. అందుకే వెంటనే ప్రకాష్‌రాజ్‌గారిని సంప్రతించాం'' అని అన్నారు.


Click it and Unblock the Notifications











