హీరోగా బండ్ల గణేష్.. అదిరే కధ చెప్పిన దర్శకుడు.. కానీ?

నటుడిగా అనేక సినిమాల్లో నటించి తరువాత కాలంలో ప్రొడ్యూసర్ గా మారి సూపర్ హిట్ సినిమాలు అందించిన బండ్ల గణేష్ ఇప్పుడు కాస్త సైలెంట్ అయ్యారు.. మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా తో ఆయన మళ్లీ యాక్టర్ గా రీ ఎంట్రీ ఇచ్చారు. రీ ఎంట్రీ ఇచ్చిన అప్పుడు అది తనకు మంచి కం బ్యాక్ అవుతుందని భావించినా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా చేయకుండా ఉండాల్సింది అని కూడా ఆయన అభిప్రాయపడ్డారు..

ఇక మీదట ఇలాంటి చిన్న పాత్రలు చేయకూడదని కూడా ఆయన ఫిక్సైనట్లు గతంలో కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. అయితే ఆయన ఒక సినిమాలో హీరోగా నటిస్తున్నారు అంటూ కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగింది.. తమిళంలో యోగి బాబు హీరోగా వచ్చిన మండేలా సినిమా సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఆ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారని ఆ రీమేక్ లో నటించమని బండ్ల గణేష్ కు ఆఫర్ వచ్చిందని కూడా ప్రచారం జరిగింది. ఆ ప్రచారం సంగతి ఎలా ఉన్నా తాజాగా వెంకట్ అనే ఒక కొత్త దర్శకుడు బండ్ల గణేష్ కోసం ఒక కథ రాసుకుని ఈ మధ్య బండ్ల గణేష్ ని కలిసి కథ వినిపించినట్లు సమాచారం. ఈ సినిమాలో ఆయన ది మెయిన్ రోల్ గా ఉండబోతుందని అంటున్నారు.

Bandla Ganesh To become A Hero

అయితే ఇంకా బండ్ల గణేష్ దీనికి సంబంధించి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని ప్రస్తుతానికి ఆయన ఆలోచించి చెబుతానని దర్శకుడికి చెప్పారని అంటున్నారు. హీరోగా నటించడం బాగానే ఉంటుంది కానీ సినిమా కనుక సరిగా వర్కౌట్ కాకపోతే మళ్ళీ జనానికి టార్గెట్ అవుతావు అనే భయం బండ్ల గణేష్ లో ఉందట.

అందుకే ఈ సినిమా మీద ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయం చెప్పకుండా కాస్త టైమ్ తీసుకుని నిర్ణయం చెబుతాను అని చెప్పారని అంటున్నారు. ఇక నిర్మాతగా ఆయన పవన్ కళ్యాణ్ తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. పవన్ లైనప్ సినిమాలు పూర్తయ్యాక ఈ సినిమా తెరకెక్కించే అవకాశం కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X