బంగార్రాజు అప్‌డేట్: నాగార్జునతో యంగ్ హీరోయిన్ రొమాన్స్?
నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో 'బంగార్రాజు' మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. చాలాకాలంగా ఈ మూవీ గురించిన వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఇంకా సెట్స్ మీదకు రాలేదు. అయితే ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన పనులు వేగవంతం చేసి త్వరలోనే రెగ్యులర్ షూట్ మొదలుపెట్టే ప్లాన్ చేస్తున్నారు.
బంగార్రాజు చిత్రానికి సంబంధించి ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో స్క్రిప్ట్ ఫైనలైజేషన్ పనులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు ఈ సినిమా నటీనటుల విషయంలోనూ యూనిట్ అంతా కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారట. తాజాగా అందిన సమాచారం మేరకు ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠికి అవకాశం ఇచ్చారని తెలుస్తోంది.

గతంలో వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాలో యంగ్ నాగార్జున సరసన నటించిన లావణ్య త్రిపాఠి అందరినీ మెప్పించింది. ఆ సినిమాకి సీక్వెల్ గానే 'బంగార్రాజు' రూపొందుతోంది కాబట్టి ఈ సారి కూడా లావణ్యనే తీసుకున్నారని టాక్. అయితే ఆమెను మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నారా? లేక రెండో హీరోయిన్ గా తీసుకున్నారా? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఇకపోతే ఈ సినిమాలో నాగార్జునతో పాటు నాగ చైతన్య, సమంత కూడా భాగం పంచుకోనున్నట్లు సమాచారం. అతి త్వరలో 'బంగార్రాజు' సెట్స్ పైకి వచ్చేస్తారట నాగార్జున అండ్ టీమ్.


Click it and Unblock the Notifications











