నయనతారకు బాపు పర్శనల్ గిప్ట్
నయనతార ని సీతగా చూపిస్తూ బాపూ శ్రీరామరాజ్యం చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ సమయంలో ఆమె ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న బాపును ఒక కోర్కె కోరారు. బాపు స్వయంగా ఒక చిత్రం గీసి ఇవ్వాలని ఆమె అడిగారు. ఆయన అందుకు అంగీకరించి తన పుస్తకం ఇచ్చి ఏ చిత్రం కావాలో కోరుకోమన్నారు.
అందుకు నయనతార మీరు ఏది ఇచ్చినా సంతోషమే అన్నారు. ఆ మీదట బాపు ఒక రోజు నయనతారకు ఒక బహుమతిని అందించారు. అది అందమైన పెయింటింగ్.ఇంతకీ ఏమిటా గిప్ట్ పెయింటింగ్ అంటే అది ఆమె కోరుకున్న చిత్రం. సీత స్వయంవరం నుంచి శ్రీరామపట్టాభిషేకం వరకు ఉండే దృశ్యాలను ఆయన చిత్రీకరించి ఇచ్చేసరికి నయనతార ధ్రిల్ అయిపోయింది.
అలాగే శ్రీరామరాజ్యం నిర్మాత కూడా సినిమా వర్కింగ్ స్టిల్స్ తో కూడిన ఆల్బమ్ ని ఇచ్చి ఆనంద పరిచారు. ఇక ఈ చిత్రంలో రాముడుగా బాలకృష్ణ,లక్ష్మణుడుగా శ్రీకాంత్ చేసారు. ముళ్ళపూడి వెంకట రమణ గారి అద్భుతమైన స్క్రిప్టుకి బాపు బొమ్మల మాదిరి చిత్రం రూపొందిందని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











