బన్నీతో ‘బర్ఫీ’ రీమేక్?

By Bojja Kumar

హైదరాబాద్ : బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం 'బర్పీ'ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్ హీరోగా ప్రియాంక చోప్రా, ఇలియానా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 14న విడుదయి మంచి టాక్ తెచ్చుకుంది.

ఈచిత్రం ఒక చెవిటి, మూగ వ్యక్తి కథ. రణబీర్ ఆ పాత్రలో అద్భుతంగా నటించాడు. రణబీర్ తన నటనతో తాత రాజ్ కపూర్ పేరు నిలబెట్టాడనే ప్రశసంసలు అందుకుంటున్నాడు. జిల్మిల్ పాత్రలో ప్రియాంక చోప్రా నటకు మంచి మార్కులు పడ్డాయి. సౌత్ లో ఇప్పటికే తన టాలెంట్ నిరూపించుకున్న ఇలియానా ఈ చిత్రంలో శృతి పాత్రలో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. బర్ఫీ చిత్రం మంచి ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్.

ఈచిత్రాన్ని అల్లు అర్జున్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో పడ్డారు తెలుగు ఫిల్మ్ మేకర్స్. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే దీనిపై అధికారిక సమాచారం వెలువడనుంది. బన్నీకి సౌత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం, తమిళనాట, కేరళలో ఈ స్టైలిష్ స్టార్ సినిమాలకు మంచి డిమాండ్ ఉండటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నారు.

నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర కావడంతో అల్లు అర్జున్ కూడా ఈ పాత్ర చేయడానికి ఆసక్తి చూపుతున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తేలాల్సి ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ 'జులాయి' హిట్ తో హ్యాపీగా ఉన్నాడు. త్వరలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఇద్దరమ్మాయిలతో' సినిమాకు సిద్ధం అవుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X