బృందావనంపైనే నా తదుపరి చిత్రాల భవితవ్యం ఉంది..!
విడుదలకు సిద్దంగా ఉన్న టాలీవుడ్ భారీ సినిమాల జాబితాలో కొంతలో కొంత వీక్ గా కనిపిస్తుంది బృందావనం ఒక్కటేనని ఎన్టీఆర్ అభిమానులు కూడా ఒప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ కు అచ్చిరాని ఫ్యామిలీ ఎంటర్ టైన్ మంట్ ప్రధానంగా, సాప్ట్ గా రూపోందుతోన్న ఈ చిత్రంపై అంచనాలు అంతగాలేవని అభిమానులు అంగీకరిస్తున్నారు. ఎప్పటికప్పుడు మార్కేట్ టాక్ ని, తన సినిమాలపై ఉన్న అంచలాలను బేరీజు వేసుకోని ముందుగా జాగ్రత్త గా వ్యవహారించే నిర్మాత దిల్ రాజు ఈ సినిమాపై తన అభిప్రాయం ఏంటనేది కూడా వెల్లడించారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని హైప్ చేసేందుకు చాలా బాగా కష్టపడుతున్నాడని వినికిడి.
కొమరం పులి, ఖలేజా, రోబో, రక్త చరిత్రతో పోటీపడుతూ బృందావనం ఈ ఐదింటిలో ఏ ప్లేసు సోంతం చేసుకుంటుందనే ఊహాగానాలు చెలరేగుతుంటే తన సినిమా మాత్రం టాప్ త్రీ లో వుంటుందని దిల్ రాజు స్టేట్ మెంట్ ఇచ్చేశాడు. దీనితో ఎన్టీఆర్ అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఐతే ఇది నిజం అనుకోవడానికి వీల్లేదు. ప్రస్తుతం దిల్ రాజు ఉన్న పరిస్ధితులను బట్టి అలా మాట్లాడి ఉండవచ్చునని సినీ వర్గాల బోగట్టా. జోష్, మరోచరిత్ర, రామరామ కృష్ణ కృష్ణ తర్వాత దిల్ రాజు జడ్జిమెంట్ పై నమ్మకం చాలామందికి సడలింది. ఆయన తదుపరి సినిమాలపై కూడా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఐతే ఓవర్ కాన్పిడెంట్ కి పెట్టింది పేరయిన దిల్ రాజు తన సినిమాలో టాలీవుడ్ టాప్ 3లో ఉంటుందనేది కూడా కేవలం అతని భ్రమే అనిఅంటున్నారు. ఈ సినిమా ఫలితంపై దిల్ రాజు తదుపరి చిత్రాల భవితవ్యం ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాబట్టి అతనికి ఈ సినిమా హిట్ అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. దిల్ రాజు స్టేట్ మెంట్ ని నిజం చేస్తూ, పోటిలో తన సత్తా నిరూపించుకుంటుందో లేదో చూడాలంటే ఈ సినిమా వచ్చేంత వరకు ఆగాల్సిందే..


Click it and Unblock the Notifications











