Megha Akash: పెళ్లి పీటలు ఎక్కబోతున్న బ్యూటీఫుల్ హీరోయిన్, వరుడు ఎవరో తెలుసా?

ఇటీవల కాలంలో కొంతమంది హీరోయిన్స్ పెళ్లి చేసుకుంటున్న విధానం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రేమ వ్యవహారలపై రూమర్స్ ఎన్ని వస్తున్నా కూడా సైలెంట్ గానే ఉంటున్నారు. ఇక సడన్ గా పెళ్లి గురించి అనౌన్స్ చేసి హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఇక త్వరలోనే మరో బ్యూటీఫుల్ హీరోయిన్ కూడా పెళ్లి వార్తతో సర్ ప్రైజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆమె మరెవరో కాదు. క్యూట్ హీరోయిన్ మేఘా ఆకాష్. ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన ఒక న్యూస్ వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆ మూవీ హిట్ కాకపోయినా: చెన్నై బ్యూటీ మేఘా ఆకాశ్ లై మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ మూవీ హిట్ కాకపోయినా, ఆమె అందానికి మాత్రం అందరూ ఫిదా అయిపోయారు. ఆ తర్వాత ఛల్ మోహన్ రంగ సినిమా కాస్త పర్వాలేదనిపించింది. కానీ తర్వాత చెప్పుకోదగిన సినిమాల్లో ఛాన్సులు మాత్రం అందుకోలేకపోయింది. పాపం, తెలుగులో ఈ ముద్దుగుమ్మ చేసిన ఏ సినిమా హిట్ కాకపోవడం గమనార్హం. కాగా, ఈ బ్యూటీ పెళ్లి పీటలు ఎక్కవడానికి రెడీ అయ్యింది.

 beautiful heroine Megha Akash To Marry A Politicians Son Soon

రాజకీయ నాయకుడి కుమారుడితో డేటింగ్: మేఘా గత కొంతకాలంగా ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడితో డేటింగ్ లో ఉందట. ఇటీవల వీరు పెళ్లితో ఒకటి కావాలని అనుకోవడంతో, ఈ విషయాన్ని కుటుంబ సభ్యుల ముందు ఉంచారట. ఇరు కుటుంబాలు అంగీకరించడంతో వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఆ రాజకీయ నాయకుడు ఎవరు అనే విషయం మాత్రం బయటకు రాలేదు.

 beautiful heroine Megha Akash To Marry A Politicians Son Soon

నిశ్చితార్థం జరగనున్నట్లు వార్తలు: కానీ, త్వరోలనే వీరి నిశ్చితార్థం జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటి వరకు ఈ విషయంపై మేఘా కానీ, ఆమె టీం కానీ స్పందించలేదు. సెలబ్రెటీలు ఏ విషయాన్ని తొందరగా బయట పెట్టరు కదా. అందుకే మేఘా కూడా తన పెళ్లి విషయాన్ని ఇప్పట్లో రివీల్ చేసేలా కనపడటం లేదు. ఏకంగా ఏంగేజ్మెంట్ చేసుకొని అనౌన్స్ చేస్తుందేమో చూడాలి.

 beautiful heroine Megha Akash To Marry A Politicians Son Soon

చివరగా రవితేజ సినిమాలో: 1995 అక్టోబర్ 26న పుట్టిన మేఘా , నటనమీద ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆమె తండ్రి తమిళియన్ కాగా, తల్లి మళయాళి. ఆమె సినిమాల్లోకి రాకముందు విజువల్ కమ్యూనికేషన్ లో బీఎస్సీ చేసింది. ఇదిలా ఉండగా, తెలుగులో లై, ఛల్ మోహన్ రంగ, రాజ రాజ చోర, ప్రియమైన మేఘా, గుర్తుందా శీతాకాలం, ప్రేమదేశం వంటి సినిమాల్లో నటించింది.

 beautiful heroine Megha Akash To Marry A Politicians Son Soon

చివరగా రవితేజ రావణాసుర మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించింది. మూవీ హిట్ కాకున్నా, మేఘా నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ మూవీ కనుక హిట్ అయ్యి ఉంటే, ఆమెకు నెగిటివ్ షేడ్స్ లో ఉన్న పాత్రలు కూడా క్యూ కట్టేవి. కానీ ఈ మూవీ కూడా బెడిసి కొట్టింది. వరసగా సినిమాలు ప్లాప్ అవ్వడంతో, ఆమె పెళ్లి చేసుకోవాలి అనుకుంటుందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X