సీనియర్ నటి జమున బయోపిక్.. ఆ బ్యూటీఫుల్ హీరోయిన్ కోసం చర్చలు!
తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సీనియర్ నటీమణులలో జమున ఒకరు. తెలుగులోనే కాకుండా తమిళం కన్నడ మలయాళం భాషల్లో కూడా అనేక చిత్రాల్లో నటించారు. దాదాపు రెండు వందలకు పైగా సినిమాల్లో నటించిన జమున ఎ పాత్ర చేసిన కూడా అందులో ఒదిగిపోయి నటించేది. ముఖ్యంగా సత్యభామ పాత్రకు ఆమెను తప్పితే ఎవరిని ఊహించుకోలేరు అనే విధంగా మెప్పించేవారు.
ఇక అలాంటి ఎంతో టాలెంట్ ఉన్న నటి సినిమా ప్రేక్షకుల్లో మర్చిపోలేని విధంగా గుర్తింపును అందుకున్నారు. అయితే ఇటీవల 86 ఏళ్ల వయసులో జమున కన్ను మూసిన విషయం తెలిసిందే. ఇక జమున మరణించిన తర్వాత ఆమె బయోపిక్ విషయంలో అనేక రకాలు వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలైతే గత కొన్ని నెలల క్రితమే ఆమె బయోపిక్ కూడా తెరపైకి రాబోతున్నట్లు ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వినిపించింది. జమునతో పాటు అప్పట్లో మంచి హీరోయిన్ గా గుర్తింపు ఉన్న మహానటి సావిత్రి బయోపిక్ కు ఏ స్థాయిలో గుర్తింపు లభించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇక జమున కెరీర్ లో కూడా కొన్ని వివాదాస్పద విషయాలు ఉన్నాయి కాబట్టి ఆమె బయోపిక్ ను తెరపైకి తీసుకువస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది అనే ఒక ప్రొడక్షన్ హౌస్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ తో పాటు ఏఎన్నార్ అలాగే మరి కొంతమంది హీరోలతో కూడా ఆమె వివాదాలను ఎదుర్కొన్నారు. అంతేకాకుండా రాజకీయాల్లో కూడా ఎన్టీఆర్కు పోటీగా ఆమె నిలబడ్డారు.
కాబట్టి ఎన్నో అంశాలు జమున జీవితంలో ముడిపడి ఉన్నాయి. ఇక ఆమె బయోపిక్ కోసం మిల్కీ బ్యూటీ తమన్నా ను ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా మరొక టాక్ వినిపిస్తోంది. ఇంతకు అసలు ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు అలాగే ఎప్పుడు రాబోతోంది అనే విషయాలు ఇంకా తెలియ రాలేదు. కానీ కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ మాత్రం తమన్నాను జమున పాత్రలో తీసుకోవాలని చర్చలు జరుపుతున్నట్లు టాక్. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో కాలమే సమాధానం చెప్పాలి.


Click it and Unblock the Notifications











