పైరసీలో పట్టుబడ్డ రామ్ గోపాల్ వర్మ....
మొన్న ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ తో మాట్లాడుతూ ఆయన దర్శకత్వంలో తర్వాత రాబోయే కథస్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు చిత్రం గురించి మాట్లాడుతున్నప్పుడు పైరసీ గురించి అభిప్రాయం అడుగగా, అందుకు ఆయన స్పందిస్తూ పైరసీ గురించి మాట్లాడేందుకు నేను అర్హుడను కాను అన్నారు.'నా అంతకు నేనూ పెద్ద పైరసీ మాస్టర్" అన్నారు. ఎందుకంటే నేను తీసే సినిమాలన్నీ అల్ మోస్ట్ ఆల్ హాలీవుడ్ చిత్రాలనుండి తీసుకొచ్చేవే అన్నారు.
దర్శకుడు అవ్వకముందు రామ్ గోపాల్ వర్మ ఓ వీడియో షాప్ నడిపేవాడు. అప్పుడు పైరసీ సీడీలు అమ్మేవాడట. ఆ విషయం తెలుసుకుని పోలీసులు రైడ్ చేసి, లాకప్ లో పెట్టారని రామ్ గాపాల్ వర్మ స్వయంగా చెప్పాడు. అప్పట్లో తెలియక పైరసీ చేశానని, కానీ ఓ సినిమా నిర్మాణం వెనకాల నిర్మాత ఎన్నీ కోట్లు వెచ్చిస్తాడో తెలిసిన తర్వాత పైరసీ చేయడం సరికాదని తెలుసుకున్నానని రామూ చెప్పాడు. అందుకే పైరసీ చేసేవారికి ఈ విషయం అర్థం అయ్యేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అతను పేర్కొన్నాడు..


Click it and Unblock the Notifications











