ఎన్టీఆర్ - రామ్ చరణ్ మల్టీస్టారర్.. ‘ఆర్ఆర్ఆర్’కు ముందు ప్లాన్ చేసిన సినిమా ఇదే!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన రాబోయే చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. తీరిక సమయం లేకుండా షూటింగ్స్ కు హాజరవుతున్నారు. మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన రాబోయే చిత్రాలతో తీరిక లేకుండా ఉన్నారు. చివరిగా వీరిద్దరూ కలిసి భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే.
అయితే ఇండియన్ ఫిలిమ్స్ లలో మల్టీస్టారర్ చిత్రాలకు భారీ డిమాండ్ ఉంటుంది. అలాగే ఇద్దరు స్టార్ హీరోలను హ్యాండిల్ చేయడం కూడా చాలా రిస్క్ తో కూడిన పని. అలాంటి పరిస్థితి ఆర్ఆర్ఆర్ చిత్రం సమయంలో నెలకొంది. కానీ ఆ ఘట్టాన్ని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో చాకచక్యంగా దాటారు. ఇద్దరు బడా హీరోలను రాజమౌళి డీల్ చేసిన విధానం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలను కురిపించింది. హాలీవుడ్ సర్కిల్స్ లో కూడా సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

మూడేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ఏకంగా సినిమాలోకం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు పోటీలకు ఎంపికైంది. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో అకాడమీ అవార్డును కూడా కొల్లగొట్టింది. అంత సవ్యంగా జరిగింది కాబట్టి అటు రామ్ చరణ్, ఇటు జూనియర్ ఎన్టీఆర్ కు గ్లోబల్ స్టార్స్ అనే బిరుదు కూడా లభించింది. అయితే వీరిద్దరూ కలిసి ఆర్ఆర్ ఆర్ చిత్రాని కంటే ముందే ఒక మల్టీస్టారర్ సినిమాకు ప్లాన్ చేశారు. కానీ అది కుదరలేదు. ఆ సినిమా ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఎవడు చిత్రం ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. 2014లో వచ్చిన ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రంలో రాంచరణ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించాల్సి ఉందంట. కాగా జూనియర్ ఎన్టీఆర్ స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కామియో అప్పియరెన్స్ లో కనిపించారు. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తన చిత్రాలతో ఫుల్ బిజీగా ఉండడం కారణంగా ఈ భారీ మల్టీ స్టార్ చిత్రం మిస్ అయ్యింది. దాంతో వారి అభిమానులు ఎంతగానో అప్సెట్ అయ్యారు.
కానీ ఆర్ఆర్ఆర్ చిత్రంతో రాంచరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇండియన్ షేక్ చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని ఈ సినిమా తర్వాత ప్రేక్షకులకు కూడా తెలిసిపోయింది. ఇక మళ్లీ వీరిద్దరు కలిసి ఎప్పుడు చేస్తారో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడు వారిద్దరికీ ఉన్న మార్కెట్, లైన్ అప్ చూస్తుంటే ఇంకో దశాబ్దం పాటు ఇలాంటి కాంబినేషన్ కుదరకపోవచ్చు అని అంటున్నారు. ఇక రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది సినిమా లో నటిస్తూ బిజీగా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో భారీ మల్టీ స్టారర్ చిత్రం వార్ 2 కు సంబంధించిన షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకున్నారు.


Click it and Unblock the Notifications











