'నయనతార నైట్స్' వెనుక స్టోరీ...

రాత్రిపూట తిరిగే వారి సంఖ్య రోజురోజుకీ బాగా పెరిగిపోతోంది. కానీ ఇది మంచి పద్ధతి కాదని డాక్టర్లు పదేపదే చెప్తూనే ఉన్నారు.ఏదైమైనా ప్రకృతి ధర్మాన్ని పాటిస్తేనే అందరికీ మేలు జరుగుతుంది''అంది ఆవలిస్తూ నయనతార. షాకయి చూస్తున్న వారికి వివరణ ఇస్తూ ''నటిగా రాత్రిళ్లు నేను పనిచేయాల్సి ఉంటుంది. కొన్ని సన్నివేశాలు పండాలంటే రాత్రిపూట చిత్రీకరించాల్సిందే. అలాంటప్పుడు ఎలాగూ మేలుకోక తప్పదు. అందుకే మిగిలిన రోజుల్లో మాత్రం ఇంటికే పరిమితం. సెల్ ఫోన్‌లో సుత్తి కబుర్లు చెబుతూ రాత్రిపూట మేలుకోవడం నాకు ఇష్టం ఉండదు.
అలాగే తరచూ పబ్‌లు, ఫంక్షన్లు అంటూ తిరగను. అసలు అలా వెళ్లాలంటే నాకు చిరాకేస్తుంది. మరీ ముఖ్యమనుకుంటే తప్పదుగానీ చాలావరకు చీకటిపడ్డాక ఫంక్షన్లకు వెళ్లను''ని చెప్పుకొచ్చింది నయనతార. అవునూ హఠాత్తుగా నయనతార ఈ నైట్ పాఠాలేంటి అంటే త్రిష ఈ మద్య రాత్రుళ్ళు నిద్రలేక ఇబ్బంది పడటం గురించి బయిటకు వచ్చింది కదా...ఆమెకు అన్యాపదేశంగా సెటైర్స్ వేస్తోందని అందరికీ అర్ధమైందిట.


Click it and Unblock the Notifications











