For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అందుకే శక్తి, షాడో సినిమాల గురించి మెగాస్టార్ పట్టించుకోలేదు.. లక్కంటే ఇలా ఉండాలి

  |

  ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే ఒక కమర్షియల్ దర్శకుడికి, డిఫరెంట్ సినిమాలు తీసే దర్శకులకు చాలా తేడా ఉంటుంది. క్రిష్, సుకుమార్, దేవకట్టా లాంటి ఓ వర్గం దర్శకులు డిజాస్టర్స్ తీసినా కూడా వారితో స్టార్ హీరోలు పని చేయడానికి సిద్ధంగా ఉంటారు. అందుకు కారణం వారి మేకింగ్ స్టైల్. సినిమా పోయినా కూడా ఏదో ఒక రకంగా మంచి గుర్తింపు వస్తుందని అనుకుంటారు. ఇక కమర్షియల్ దర్శకులకు సక్సెస్ వచ్చినా కూడా కొంతమంది ఒప్పుకోరు అలాంటిది మెగాస్టార్ మెహర్ రమేష్ లాంటి దర్శకుడిపై ఇంట్రెస్ట్ చూపడం హాట్ టాపిక్ గా మారింది. నిజంగా లక్కంటే అలానే ఉండాలని కూడా కొందరు కామేంట్స్ చేస్తున్నారు.

  2002లోనే నటుడిగా ఎంట్రీ..

  2002లోనే నటుడిగా ఎంట్రీ..

  మెహర్ రమేష్ 2002 నుంచే సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. మొదట మహేష్ బాబు బాబు బాబీ సినిమాలో ఒక ఫ్రెండ్ పాత్రలో కనిపించాడు. ఇక ఆ తరువాత పలు సినిమాలకు సహాయక దర్శకుడిగా పని చేసి కొన్నాళ్లకు డైరెక్టర్ కావాలని చాలా మంది హీరోల చుట్టూ తిరిగాడు. మెగాస్టార్ దగ్గరి బంధువు అయినప్పటికీ ఆ కాంపౌండ్ లో ఆవకాశం రాలేదు.

  రీమేక్ లతో భారీ విజయాలు

  రీమేక్ లతో భారీ విజయాలు

  మెల్లగా ఆంధ్రవాలా సినిమాను పునీత్ రాజ్ కుమార్ తో కన్నడలో రీమేక్ చేసి హిట్టు కొట్టడు. ఆ తరువాత ఒక్కడు సినిమాను కూడా అదే హీరోతో రీమేక్ చేసి విజయం సాధించాడు. ఇక ఆ తరువాత తెలుగులో ఎన్టీఆర్ తో కంత్రి సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా కూడా జస్ట్ మై లక్ అనే హాలీవుడ్ సినిమా కథను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించిందే. అనంతరం ప్రభాస్ తో బాలీవుడ్ బిల్లాను రీమేక్ చేసి పరవాలేదు అనిపించాడు.

  శక్తి, షాడో కొట్టిన దెబ్బలకు

  శక్తి, షాడో కొట్టిన దెబ్బలకు

  మొత్తంగా మెహర్ రమేష్ జర్నీలో సొంతంగా రాసుకున్న కథలు తప్పితే మిగతావి డిజాస్టర్స్ గా నిలిచాయి. శక్తి, షాడో సినిమాలు ఏ రేంజ్ లో డిజాస్టర్ అయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ రెండు సినిమాలు కొట్టిన దెబ్బలకు మెహర్ రమేష్ మళ్ళీ కొన్నాళ్ళు కనిపించలేదు. ఇక చాలా రోజుల తరువాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నట్లు కథనాలు రావడంతో మెగాస్టార్ ఎందుకు అతనితో సినిమా చేస్తున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది.

  Megastar Chiranjeevi To Meet CM Jagan To Discuss Tollywood Problems
  మెగాస్టార్ ఒప్పుకోవడానికి కారణం..

  మెగాస్టార్ ఒప్పుకోవడానికి కారణం..

  మెహర్ రమేష్ రీమేక్ కథలతో ఇంతవరకు ఫెయిల్ అయితే అవ్వలేదు. వేదళం రీమేక్ కోసం మూడేళ్ళు కష్టపడి స్క్రిప్ట్ ని రెడీ చేసుకున్నాడు. ఆ డెడికేషన్ మెగాస్టార్ కి చాలా బాగా నచ్చిందట. అందుకే అతని బ్యాక్ గ్రౌండ్ డిజాస్టర్స్ గురించి పెద్దహా ఆలోచించకుండా ఒప్పేసుకున్నట్లు తెలుస్తోంది. కెరీర్ దాదాపు ఎండ్ అయ్యిందని అనుకున్న సమయంలో రమేష్ కి ఇది గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. మరి ఈ అవకాశాన్ని ఎంతవరకు యూజ్ చేసుకుంటాడో చూడాలి.

  English summary
  For the most part in the film industry it is all too common for stories to go from one hero to another. Sometimes those projects can be disasters and other times they can break industry records. The first three stories of Koratala Shiva were also thought of with different heroes at first. But the success of those films came as a shock to those who rejected them.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X