twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ 'వీరమల్లు'.. హీరో సెలెక్షన్ వెనుక జరిగిన అసలు స్టోరీ, వాళ్ళతో చేయలేక..

    |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఇంకా గ్లింప్స్ వైరల్ అవుతూనే ఉంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా దర్శకుడు మొదట పవన్ కళ్యాణ్ ను అనుకోలేదట. వేరే హీరోల దగ్గరకు వెళ్లాడట.

    చీరకట్టు అందాలతో అనసూయ భరద్వాజ్: స్టేజీపై డాన్స్ (ఫొటోలు)

    బాలకృష్ణ సినిమా తరువాత..

    బాలకృష్ణ సినిమా తరువాత..

    దర్శకుడు క్రిష్ బాలకృష్ణతో 2017లో గౌతమి పుత్ర శతకర్ణి సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఆ సినిమాతో హిస్టారికల్ కథలను కూడా తెరకెక్కించగలడని ఇండస్ట్రీలో మంచి గుర్తింపు అందుకున్నాడు. ఆ సినిమా అనంతరం మరో హిస్టారికల్ కథను తెరకెక్కించాలని దర్శకుడు క్రిష్ రెండు కథలపై ఫోకస్ పెట్టాడు. ఇక బాలీవుడ్ నుంచి ఝాన్సీ లక్ష్మీ బయోపిక్ ఆఫర్ రావడంతో ఆ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు.

    తమిళ్ హీరోతో..

    తమిళ్ హీరోతో..

    ఇక ఆ తరువాత బాలకృష్ణ నుంచి ఎన్టీఆర్ బయోపిక్ ఆఫర్ రావడంతో వీరమల్లు కథను హోల్డ్ లో ఉంచాడు. గత రెండేళ్లుగా ఆ సినిమా కథలో అనేక మార్పులు చేశాడట. ముందుగా హరిహర వీరమల్లు కథను బైలాంగ్యువల్ ప్రాజెక్టుగా తెరకెక్కించాలని అనుకున్నారట. అందుకోసం తమిళ్ హీరో సూర్యను కూడా సంప్రధించినట్లు అప్పట్లో టాక్ వచ్చింది.

    విజువల్‌ ఫీస్ట్‌గా..

    విజువల్‌ ఫీస్ట్‌గా..

    వీరమల్లు సినిమా 17 శతాబ్దంలో జరిగే కథ. మొఘలాయిలు, కుతుబ్‌షాహీల శకం నేపథ్యంలో జరిగే ఈ కథలో పవన్ కళ్యాణ్ ఒక బందిపోటుగా కనిపించబోతున్నాడు. విజువల్‌ ఫీస్ట్‌గా రూపొందనున్న ఈ సినిమా బడ్జెట్ దాదాపు 150కోట్ల వరకు అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే 40శాతం షూటింగ్ పూర్తయ్యింది.

    వరుణ్ తేజ్ కోసం అనుకుంటే..

    వరుణ్ తేజ్ కోసం అనుకుంటే..

    ఇక తెలుగులో పవన్ కళ్యాణ్ ను సెలెక్ట్ చేసుకున్నప్పటికి అంతకుముందు మరికొంత మంది తెలుగు హీరోలను అనుకున్నాడట క్రిష్. కంచె సినిమా అనంతరం వరుణ్ తేజ్ తో మరో సినిమా తప్పకుండా చేస్తానని అప్పట్లో ఎనౌన్స్ చేశాడు. వీరమల్లు కథను కూడా వరుణ్ తేజ్ కు చెప్పినట్లు టాక్. అయితే బడ్జెట్ ఎక్కువవుతుండడం వరుణ్ తేజ్ మార్కెట్ సరిపోదని క్రిష్ ఆలోచన మార్చుకున్నాడట.

    300 ఏళ్ల క్రితం..

    300 ఏళ్ల క్రితం..

    పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ ఇప్పటివరకు హిస్టారికల్ కథలో నటించ లేదు కాబట్టి ఆయానైతే బెటర్ అని క్రిష్ ఫిక్స్ అయ్యాడు. ఫైనల్ గా ప్రాజెక్ట్ లోకి పవన్ రాకతో పాన్ ఇండియా మూవీగా మారింది. తెలుగులో తమిళ్ లోనే కాకుండా హిందీ మళయాళంలో కూడా భారీగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇక 300 ఏళ్ల క్రితం ఉన్న వాతావరణంలో చార్మినార్‌, రెడ్‌ ఫోర్ట్‌, మచిలీపట్నం పోర్ట్‌ వంటి భారీ సెట్లను నిర్మించారు. జూలై వరకు షూటింగ్ పనులను పూర్తి చేసి ఆరు నెలల వీఎ్‌ఫఎక్స్‌ పనులతో బిజీ కానున్నారట. సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

    English summary
    Pawan Kalyan’s upcoming film under Krish’s direction has been constantly making headlines for the last couple of months regarding its leading lady. After Pragya Jaiswal and Keerthy Suresh, Bollywood actress Jacqueline Fernandez was said to be roped in as the leading lady opposite the Powerstar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X