త్రివిక్రమ్ తొందరపాటు.. ఉప్పెన దర్శకుడి కలిసొచ్చిన పాన్ ఇండియా ఆఫర్!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేసినట్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ దర్శకుడు కూడా ఆ స్థాయిలో సీన్స్ రెడీ చేయలేరు. పైగా మాటలతో సినిమా కథకు మరింత బలాన్ని ఇవ్వగలరు. అప్పుడప్పుడు కాపీ ఆరోపణల ఎదుర్కొన్నప్పటికీ ఆయనపై హీరోలకు నమ్మకం పోలేదు. ఎలాంటి సినిమా చేసినా కూడా తనదైన శైలిలో ప్రజెంట్ చేయగలరు.
ఇక త్రివిక్రమ్ చాలా రోజుల తరువాత ఒక హీరోతో ఆల్ మోస్ట్ ఓకే చేసుకున్న ప్రాజెక్టు నుంచి బయటకు రావడం అందరిని షాక్ కు గురి చేసింది. అది కూడా జూనియర్ ఎన్టీఆర్ తో చేయాల్సిన ప్రాజెక్ట్. అయితే ఆ సినిమా కథను పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా మలిచే అవకాశం లేకపోవడం వల్లనే తారక్ వెనుకడుగు వేసినట్లు టాక్ వచ్చింది. ఇక త్రివిక్రమ్ తో భవిష్యత్తులో మరో సినిమా చేయడానికి తారక్ రెడీగా ఉన్నట్లు టాక్ వచ్చింది.

కానీ ప్రస్తుతం నందమూరి హీరో లైనప్ చూస్తే ఇప్పట్లో త్రివిక్రమ్ తో సినిమా వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఇక బుచ్చిబాబుతో ఒక సినిమా కథపై చర్చలు జరపగా మొదట అది లోకల్ కథ అయినప్పటికీ బుచ్చిబాబు పాన్ ఇండియా కథగా మార్చేశాడట.
త్రివిక్రమ్ పాన్ ఇండియా కథ సెట్ చేసి ఉంటే తప్పకుండా ఎన్టీఆర్ ఒప్పుకునేవాడు. కానీ ఎందుకోమరి ఆయన ఒప్పుకోలేక తప్పుకున్నారు. ఇక ఆ ఛాన్స్ ను మాత్రం ఉప్పెన దర్శకుడు మిస్ చేసుకోలేదు. ఎన్టీఆర్.. RRR, కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమాల అనంతరం బుచ్చిబాబుతో సినిమా చేయవచ్చని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











