Prabhas: గాయంతో బాధపడుతున్న రెబల్ స్టార్.. అందుకే ఆ దేశానికి పయనం..
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుంది అని చిత్ర యూనిట్ సభ్యులు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా విడుదల తర్వాత ఒక్కసారిగా కలెక్షన్స్ డౌన్ అయ్యాయి. ఇక సినిమా దాదాపు డిజాస్టర్ గా నిలిచిపోయే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రభాస్ సినిమా రిజల్ట్ కారణంగానే విడుదల తర్వాత మళ్లీ మీడియా ముందుకు రాలేదు అని, ప్రత్యేకంగా మరొక దేశానికి వెళ్లిపోయినట్లు కొన్ని రకాల కథనాలు వెలువడ్డాయి. అయితే ప్రభాస్ అలా కాకుండా ఒక గాయం కారణంగా సర్జరీ కోసం విదేశాలకు వెళ్లినట్లుగా తెలుస్తోంది ఆ వివరాల్లోకి వెళితే..

ఓ వర్గం వారికి నచ్చినా..
యువి క్రియేషన్స్ లో సాహో సినిమా తర్వాత ప్రభాస్ ఎంతో ఇష్టంగా చేసిన మరో సినిమా రాధే శ్యామ్. తప్పకుండా ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంటుంది అని ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. కానీ సినిమా విడుదలైన మొదటి నుంచే డివైడ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఓ వర్గం ప్రేక్షకులు సినిమా బావుందమి చెప్పినా మాస్ ఆడియన్స్ కు మాత్రం సినిమా ఏమాత్రం కనెక్ట్ అవ్వలేదు. మొదటి మూడు రోజుల తర్వాత సినిమా కలెక్షన్స్ ఒక్కసారిగా తగ్గిపోయాయి.

నెగిటివ్ రివ్యూలు
అయితే రాధే శ్యామ్ సినిమాకు సంబంధించిన రిజల్ట్ ను ప్రభాస్ ముందుగానే ఊహించాడు అని నార్త్ మీడియాలో రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. ఈ సినిమా తెలుగులో మొదటి మూడు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద పరవాలేదు అనే విధంగా ఆకట్టుకోగా మిగతా భాషల్లో మాత్రం ప్రభావం కొంచెం కూడా ప్రభావం చూపలేకపోయింది. ఇక నార్త్ మీడియాలో కూడా సినిమాకు నేవిటివ్ రివ్యూలు గట్టిగానే వచ్చాయి.

రెస్ట్ తీసుకోవాలని..?
అయితే ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా ప్లాప్ అనే కారణంగా.. సినిమా విడుదల తర్వాత కూడా మీడియా ముందుకు రాలేదని కథనాలు వెలువడ్డాయి. అంతేకాకుండా ప్రభాస్ స్పెయిన్ వెళ్ళిపోయి అక్కడే కొన్నాళ్లపాటు రెస్ట్ తీసుకోవాలని అనుకుంటున్నట్లు కూడా ఎన్నో పుకార్లు వినిపించాయి.

నొప్పి కారణంగా..
అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని ప్రభాస్ సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నప్పుడు అతని కాలికి గాయం అయినట్లు తెలుస్తోంది. అయితే దాని కోసం సర్జరీ చేయించుకోవాలని వైద్యులు అప్పుడే సూచించారట. రాధే శ్యామ్ సినిమా విడుదలకు సిద్హంగా ఉంది కాబట్టి ప్రమోషన్ కోసం ప్రభాస్ ఆ సర్జరీని కాస్త ఆలస్యం చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఫైనల్ గా సినిమా విడుదల అవుతోంది అనగానే అప్పుడు ప్రభాస్ సర్జరీ కోసం స్పెయిన్ వెళ్లిపోయినట్లు సమాచారం.

సలార్ పైనే అందరి ఫోకస్
ఇక ప్రస్తుతం ప్రభాస్ లిస్టులో అందరి ఫోకస్ ఎక్కువగా సలార్ సినిమా పైనే ఉండేది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆది పురుష్, రామాయణం కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాబట్టి ఈ సినిమా ఎంతవరకు మాస్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందో చెప్పలేము ఇక ఆ తర్వాత ప్రాజెక్టు K , స్పిరిట్ సినిమాలు థియేటర్స్ లోకి వచ్చేసరికి మరింత ఆలస్యం అయ్యేలా ఉంది.
Recommended Video


సలార్ పై నమ్మకం
ఇక మధ్యలో మారుతి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయనున్నాడు. అయితే మారుతి ప్రభాస్ రేంజ్ కు తగ్గట్టుగా సినిమా చేస్తాడా లేదా అనే మరొక ఆసక్తికరమైన అంశం. ఇక అందరికీ సలార్ సినిమా పైనే ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే దర్శకుడు ప్రశాంత్ యాక్షన్ సీక్వెన్స్ తో ప్రభాస్ ను కరెక్ట్ గా ప్రజెంట్ చేయగలరు అని నమ్ముతున్నారు.


Click it and Unblock the Notifications











