బెల్లంకొండ రవితేజకు ట్విస్ట్ ఇచ్చాడా?
అప్పట్లో బెల్లంకొండ సురేష్,రవితేజ కాంబినేషన్ లో శంభో శివ శంభో చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే.సముద్ర ఖని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రవితేజ నటించినందుకు రెమ్యునేషన్ క్రింద బెల్లంకొండ సురేష్ ఓ స్ధిరాస్ధిని ఇచ్చాడు.అయితే ఆ తర్వాత అది లిటిగెంట్ ఆస్ధి అని బయిటపడి రవితేజ నోరు వెళ్ళపెట్టాడు.అప్పటికే అందులో నటించిన ప్రియమణి తనను బెల్లంకొండ రెమ్యునేషన్ ఎగ్గొట్టి గోలీమార్,శంభో శివ శంభో చిత్రాల్లో చేయించుకున్నాడని గోలెత్తుతోంది.ఈ నేపధ్యంలో రవితేజ సైలెంట్ అయ్యారు.
అందులోనూ శంభో శివ శంభో చిత్రం ఆడకపోవటం కూడా రవితేజ ఏమి మాట్లాడనీయకుండా చేసింది.అయితే ఆ తర్వాత నందినిరెడ్డి తో బెల్లంకొండ సినిమా చేస్తానన్నప్పుడు రవితేజ ఆమెకు డేట్స్ ఇస్తానన్నాడు కానీ బెల్లంకొండతో అయితే కష్టమన్నాడు.అది అలా జరుగుతూండగా లేటెస్ట్ గా హిట్టైన కందిరీగ చిత్రంలో నటించిన రామ్ కి ఓ కోటి రూపాయలు ఎగ్గొట్టి ట్విస్ట్ ఇవ్వబోయాడు.అతను వెంటనే మా అశోశియేషన్ ని సంప్రదించి బయిటపడే ప్రయత్నం చేసారు.ఈ నేపధ్యంలో బెల్లంకొండతో సినిమా అంటే ఎస్టాబ్లిషెడ్ హీరోలు,హీరోయిన్స్ జంకుతున్నారు.


Click it and Unblock the Notifications











