టాలీవుడ్‌లోకి మరో వారసుడు ఎంట్రీ.. లవ్ స్టోరీతో తెరంగేట్రం చేయబోతున్నాడు

ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసుకుంటూ తెలుగు సినీ ఇండస్ట్రీలోనే బడా ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్నారు బెల్లంకొండ సురేష్. దాదాపుగా టాలీవుడ్‌లోని స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన ఆయన.. కొద్దిరోజులుగా ప్రొడ్యూసింగ్‌కు దూరంగా ఉంటున్నారు. దీనికి కారణం ఆయన కుమారుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను చిత్ర పరిశ్రమకు పరిచయం చేయడమేనని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ప్రత్యేకించి ఈ యువ హీరో కోసం ఆయన ఎంతో డబ్బును ఖర్చు చేశారన్న వార్తలు కూడా వచ్చాయి.

'అల్లుడు శీను' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు బెల్లంకొండ వారి అబ్బాయి సాయి శ్రీనివాస్. ఈ సినిమా ఆశించినంత ఆడకపోయినా పర్వాలేదనిపించింది. ఇక, దీని తర్వావ ఎన్నో సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేశాడు. అయితే, అవేవీ అతడికి హిట్‌ను అందించలేకపోయాయి. కానీ, వీటిన్నింటిలో కొంతలో కొంత బోయపాటి డైరెక్షన్‌లో వచ్చిన 'జయ జానకి నాయక' మాత్రం ప్రేక్షకులను మెప్పించింది. ఇక, తాజాగా వచ్చిన 'రాక్షసుడు'తో బెల్లంకొడ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

 Bellamkonda Sai Ganesh Will Enters Tollywood

ఈ సినిమా ఫలితంతో చిత్ర యూనిట్‌తో పాటు బెల్లంకొండ సురేష్‌ కూడా ఫుల్ ఖుషీగా ఉన్నారు. అందుకే విజయోత్సవ సంబరాల్లో ఆయన కూడా పాలు పంచుకున్నారు. ఈ ఉత్సాహంతోనే ఆయన తన రెండో కుమారుడు బెల్లంకొండ సాయి గణేశ్‌ను సినీ రంగ ప్రవేశం చేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది.

సాయి గణేశ్ త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు 'ప్రేమ ఇష్క్ కాదల్', 'సావిత్రి' చిత్రాలను తెరకెక్కించిన యంగ్ డైరెక్టర్ పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తాడని సమాచారం. పూర్తి లవ్ స్టోరీగా రూపొందనున్న ఈ చిత్రాన్ని బెక్కెం వేణుగోపాల్‌తో కలిసి బెల్లంకొండ సురేష్ స్వయంగా నిర్మించనున్నారనే టాక్ వినిపిస్తోంది. గణేశ్ గతంలో పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు. కొద్దిరోజులుగా లుక్ విషయంలో జాగ్రత్తలు పడడంతో పాటు, యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకుంటున్నాడని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X