బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్... కావ్యతో వివాహం ఎప్పుడు? ఎక్కడంటే?

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ప్రస్తుతం బ్యాచిలర్స్‌గా ఉన్న నటీనటులు ఒక్కొక్కరిగా సోలో లైఫ్‌కి ఎండ్ కార్డ్ వేసి వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఆల్రెడీ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న వారు లవ్‌స్టోరీకి ఫుల్ స్టాప్ పెట్టి ఫ్యామిలీ లైఫ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. కొద్దిరోజుల క్రితం టాలీవుడ్ లవ్‌బర్డ్స్ రష్మిక మందన్న - విజయ్ దేవరకొండలు పెళ్లి చేసుకున్నారు. ఆ మరుసటి వారానికే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ తన ప్రియురాలు నయనిక రెడ్డి మెడలో మూడు ముళ్లు వేశారు.

ఇంటివాడు కానున్న బెల్లంకొండ హీరో
వీరి బాటలోనే నడిచేందుకు టాలీవుడ్‌కు చెందిన పలువురు నటీనటులు సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ కుమారుడు, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన ప్రియురాలిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. కావ్య అనే అమ్మాయితో శ్రీనివాస్ గత కొన్నేళ్లుగా ప్రేమాయణాన్ని సాగిస్తున్నారు. వీరి వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలిపారు. దీనిలో భాగంగా మార్చి 8న తనకు కాబోయే భార్యను శ్రీనివాస్ పరిచయం చేశారు. దీనికి సంబంధించి ఓ చిన్న ఫంక్షన్ నిర్వహించారు. అయితే అది నిశ్చితార్ధం కాదని, త్వరలోనే ముఖ్యమైన తేదీలను ప్రకటిస్తామని శ్రీనివాస్ పేర్కొన్నారు.

Bellamkonda Sai Sreenivas to Marry Girlfriend Kavya Reddy Soon Wedding Dates Buzz Goes Viral

భార్యను పరిచయం చేసిన సాయి శ్రీనివాస్
నా జీవితంలోకి వచ్చినందుకు, నాపై నమ్మకం ఉంచినందుకు, ప్రతి నిత్యం లెక్కలేనన్ని చిరునవ్వులను నింపినందుకు థ్యాంక్స్. నీ ముఖంపై చిరునవ్వుని ఎప్పటికీ వాడిపోనీయను అంటూ కాబోయే భార్య గురించి చెప్పుకొచ్చారు శ్రీనివాస్. తన అభిమానుల ప్రేమ, మద్ధతు తన ప్రపంచమంటూ ఆయన రాసుకొచ్చారు. సాయి శ్రీనివాస్- కావ్యల ఫంక్షన్‌కు దర్శకుడు బోయపాటి శ్రీను, హీరోయిన్ సంయుక్త మీనన్ సహా పలువురు సినీ ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.

కావ్య బ్యాక్‌గ్రౌండ్ ఇదే
ఇదిలాఉండగా.. కావ్యకు సినీరంగంతో ఎలాంటి సంబంధం లేదు. ఆమె హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ న్యాయవాది కుమార్తె. వీరిద్దరూ గత కొన్నేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఇక నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడైన సాయి శ్రీనివాస్.. తన తండ్రి అడుగుజాడల్లోనే సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. అల్లుడు శీనుతో ఘనంగా సినీ పరిశ్రమకు పరిచయమై తనదైన నటనతో దూసుకెళ్తున్నారు శ్రీనివాస్. గతేడాది భైరవ, కిష్కింధపురి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన ఆయన.. ప్రస్తుతం హైందవ, టైసన్ నాయుడు సినిమాలలో నటిస్తున్నారు.

ఏప్రిల్ 5న నిశ్చితార్ధం?
అంతాబాగానే ఉంది కానీ.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్- కావ్యల నిశ్చితార్ధం ఎప్పుడు? వివాహం ఎప్పుడు? డెస్టినేషన్ వెడ్డింగా? లేక ఇండియాలోనే జరుపుకుంటారా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో బెల్లంకొండ వారి పెళ్లిసందడికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం ఏప్రిల్ 5న వీరి పెళ్లి ఘనంగా జరగనుంది. అలాగే ఏప్రిల్ 29న విరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారట.

సింపుల్‌గా బెల్లంకొండ పెళ్లి
అయితే మిగిలిన సెలబ్రిటీల మాదిరిగా విదేశాల్లోనో, రాజస్థాన్ ప్యాలెస్‌లలోనో డెస్టినేషన్ వెడ్డింగ్ లాంటివి లేకుండా తిరుపతిలో అత్యంత సన్నిహితుల సమక్షంలో సాయి శ్రీనివాస్- కావ్యల వివాహం నిర్వహించాలని బెల్లంకొండ కుటుంబం భావిస్తోందట. వివాహం తర్వాత మే 1న హైదరాబాద్‌లో సినీ, రాజకీయ, ప్రముఖుల కోసం భారీ రిసెప్షన్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X