ఉప్పెన హీరోయిన్‌ను లైన్లో పెట్టిన బెల్లంకొండ బ్రదర్.. అన్నదారిలోనే తమ్ముడు..

టాలీవుడ్ లో నిర్మాతలు కొడుకులు హీరోలు గా మారడం చాలా సందర్భాల్లో చూశాం. తెలుగులో ఒకప్పుడు టాప్ ప్రొడ్యూసర్ గా అనేక సినిమాలు చేసిన బెల్లంకొండ సురేష్ కుమారులు ఇద్దరూ టాలీవుడ్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు శీను సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఈ మధ్య కాలంలో విడుదలైన రాక్షసుడు సినిమాతో హిట్ కొట్టారు. ఇక ఆయన బాలీవుడ్ కి వెళ్లాలని నిర్ణయించుకోవడంతో టాలీవుడ్లోకి ఆయన తమ్ముడు బెల్లంకొండ గణేష్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే ఆయన పవన్ సాదినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రీమేక్ సినిమాల హక్కులు కొన్నట్లు ప్రచారం జరుగుతోంది.

దీంతో ఆయన మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా జరుగుతోంది. అయినా అవేమీ పట్టించుకోకుండా తమ్ముడు కూడా అన్న బాటలో ఒక హిందీ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2006 లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచిన వివాహ్ అనే సినిమాను హక్కులు బెల్లంకొండ సురేష్ దక్కించుకున్నారని తెలుస్తోంది. షాహిద్ కపూర్, అమృతారావు హీరోహీరోయిన్లుగా సూరజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

 Bellamkonda Saiganesh to remake Vivah with Krithy shetty

ఒక జంట ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి పెళ్లి వరకు జరిగిన ఈ పరిణామాలతో ఈ సినిమాని తెరకెక్కించ గా సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఆ రోజుల్లోనే 8 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 53 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. తాజాగా ఈ సినిమా తెలుగులో రీమేక్ చేసేందుకు రీమేక్ హక్కులు బెల్లంకొండ సురేష్ కొన్నారని అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతిశెట్టిని నటింపజేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఈ మేరకు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారని అంటున్నారు. అయితే తేజ సినిమానే కాదనుకున్న ఈ భామ ఇప్పుడు ఈ సినిమా ఒప్పుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X