ఎన్టీఆర్‌కు బెల్లంకొండ పేమెంట్....ఒకేసారి మూటగా?
హైదరాబాద్ : జూ ఎన్టీఆర్-బెల్లంకొండ సురేష్ కాంబినేషన్లో సంతోష్ శ్రీనివాస్ దర్శకుడిగా 'రభస'(వర్కింగ్ టైటిల్) అనేచిత్రానికి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకున్న ఈచిత్రానికి జూ ఎన్టీఆర్ టాలీవుడ్లోనే ఇప్పటి వరకు ఎవరూ తీసుకోనంత భారీ మొత్తం రెమ్యూనరేషన్‌గా తీసుకుంటున్నాడని టాక్.
ఈ సినిమాకు జూ ఎన్టీఆర్ రూ. 13 నుంచి రూ. 15 కోట్ల వరకు తీసుకుంటున్నాడనే వార్తలు వినిపించాయి. తాజాగా అందిన మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ అమౌంట్ మొత్తాన్ని నిర్మాత బెల్లంకొండ సురేష్ వాయిదాలలో కాకుండా ఒకేసారి మూటగా చెల్లించాడట.
సాధారణంగా ఏ తెలుగు సినిమా నిర్మాత అయినా....సినిమాకు సైన్ చేసేప్పుడు అడ్వాన్స్‌గా కొంత మొత్తాన్ని, సినిమా ప్రారంభం అయి పూర్తయ్యేలోగా విడుదల వారీగా మిగతా పేమెంట్ మొత్తాన్ని హీరోకు చెల్లిస్తారు. కానీ బెల్లంకొండ ఆ అమౌంట్ మొత్తాన్ని సినిమా ఇంకా ఫ్లోర్ మీదకు రాకముందే చెల్లించాడట.
ఈ విషయం విని ఇతర టాలీవుడ్ నిర్మాతలు నోరెల్లబెట్టారు. బెల్లంకొండ ఇలాంటి సంస్కృతికి తెరతీయడంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కూడా. సినిమా మొదలు కాకముందే రెమ్యూనరేషన్ మొత్తం ఒకేసారి చెల్లించడం సరైన పద్దతి కాదని, వాయిదాల పద్దతి అయితేనే నిర్మాతలకు అనుకూలంగా ఉంటుందని అభిప్రాయ పడుతున్నారు. కాగా ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











