For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్డి నమ్మకం కొంప ముంచిందా? తండ్రికి బెల్లంకొండ శ్రీను క్షమాపణ.. ఏం జరిగిందంటే!

|

పెద్దల మాట సద్దిమూట అనే సామెతను ఈ జనరేషన్ వాళ్లకు అంతగా రుచించదేమో అనిపిస్తుంది. కాని ఆ సామెత వెనుక ఉండే మర్మాన్ని అర్థం చేసుకొనే యువత అప్పుటప్పుడు పప్పులో కాలేస్తుంటారు. తాజాగా టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌కు అదే ఎదురైంది. సీత చిత్రంలోని పాత్రను ఒప్పుకోవద్దని తండ్రి, నిర్మాత బెల్లంకొండ సురేష్ చెప్పిన మాటలు పెడచెవిన పెట్టిన యువహీరో ప్రస్తుతం పశ్చాత్తాపం చెందుతున్నట్టు సమాచారం. సీత విషయంలో ఏం జరిగిందంటే..

దర్శకుడు తేజ రెండు కథలు చెప్పగా

సీత సినిమా కథను నిర్మాత బెల్లంకొండ సురేష్, శ్రీనివాస్‌కు దర్శకుడు తేజ చెప్పారట. ఆ సమయంలోనే మరో కథను కూడా తేజ వినిపించారట. అయితే నటుడిగా నిరూపించుకొనేందుకు శ్రీనివాస్ సీత కథలోని రాము పాత్ర కోసం పట్టుపట్టారట. అయితే నిర్మాత సురేష్ అందుకు ఒప్పుకోకపోగా.. రెండో కథ నీకు సూట్ అవుతుందని సూచించారట. అయితే తండ్రి మాటను పక్కన పెట్టి సీత చిత్రంలోని రాము పాత్రను చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందట.

కొడుకుకు బెల్లంకొండ సురేష్ హెచ్చరిక

సీత చిత్రంలోని రాము పాత్ర చాలా బలహీనంగా డిజైన్ చేశారు. ఆ పాత్ర నీ కెరీర్‌కు ఎలా ఉపయోగపడదు అని బెల్లంకొండ సురేష్ హెచ్చరించాడట. అయితే దర్శకుడు తేజపై గుడ్డినమ్మకంతో సినిమాను ఒప్పుకొన్నాడు. దాంతో మనస్తాపం చెందిన బెల్లంకొండ సురేష్ సినిమా ఫంక్షన్లలో గానీ, ప్రమోషన్ల సందర్భంగా కనిపించలేదు అని సన్నిహితులు వెల్లడించారు.

సీత మూవీ పరాజయంతో

ఇటీవల సీత చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పొందింది. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో కాజల్‌తోపాటు విలన్ పాత్రధారి సోనూసూద్‌కు మంచి పేరు వచ్చింది. కానీ బెల్లంకొండ శ్రీనుకు మాత్రం ఆశించినంత ప్రశంసలు దక్కలేదనే మాట వినిపించింది. ప్రస్తుతం సీత చిత్రంలోని పాత్రను ఎంపిక చేసుకొన్నందుకు పశ్చాత్తాపం చెందుతున్నారట. తన తండ్రి చెప్పిన మాటను వినాల్సిందనే విషయాన్ని సన్నిహితులు వద్ద చెప్పుకొని బాధపడుతున్నారట.

తండ్రికి క్షమాపణలు

సీత పరాజయంతో మరోసారి బెల్లంకొండ శ్రీను డీలా పడిపోయారట. తండ్రి మాటను కాదన్నందుకు చింతిస్తూ.. బెల్లంకొండ సురేష్‌కు క్షమాపణలు చెప్పారట. ఈ సందర్భంగా మీరు చెప్పిన మాట వినాల్సిందని తండ్రితో శ్రీనివాస్ అన్నట్టు ఆంగ్ల దినపత్రిక కథనంలో పేర్కొన్నది. గతంలో ఓ స్టార్ హీరో కుమారుడు కూడా తండ్రి చెప్పిన మాటలు వినకుండా చేతులు కాల్చుకొన్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

English summary
Bellamkonda Sreenivas latest movie is Sita. He has been paired second time after Kavacham. This movie directed by Teja. This movie set to release on May 24th. Sita has failed to impress the audience, Sreenivas seems to have come to terms with his mistake as he apologised to his father for not listening when he should have.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more