twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రవితేజ,సునీల్ నో...బెల్లంకొండ శ్రీనివాస్ యస్

    By Srikanya
    |

    హైదరాబాద్ : గత రెండు సంవత్సరాలుగా రవితేజ చేస్తాడు లేదా సునీల్ చేస్తాడు అంటూ తమిళ హిట్ సుందరపాండ్యన్ రీమేక్ నలుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ రీమేక్ కు బెల్లంకొండ శ్రీనివాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందని ఫిల్మ్ నగర వర్గాల సమాచారం. సుందర్ అండ్ కో అనే టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కనుందని చెప్పుకుంటున్నారు. ఈ మేరకు బెల్లంకొండ సురేష్ తో చర్చలు జరిగాయని, హిట్ రీమేక్ కాబట్టి ఇమ్మిడియిట్ గా ఓకే చేసినట్లు వినికిడి. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఈ మేరకు ప్రకటన వచ్చే అవకాసం ఉంది.

    https://www.facebook.com/TeluguFilmibeat

    తెలుగులో రీమేక్‌ సినిమాలు తీయడంలో పెట్టింది పేరు... భీమనేని శ్రీనివాసరావు. ఇదివరకు ఆయన తీసిన పలు చిత్రాలు విజయవంతమయ్యాయి. ఏడాది కిందట నరేష్‌తో 'సుడిగాడు' చిత్రాన్ని తెరకెక్కించి విజయాన్ని అందుకొన్నారు. తాజాగా మరో సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు. తమిళంలో విజయవంతమైన 'సుందరపాండ్యన్‌' చిత్రాన్ని తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిస్తారని సమాచారం.

    Bellamkonda Srinivas in Bheemineni direction

    ఇటీవలే కథ విన్న శ్రీనివాస్ ఇందులో నటించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కథాచర్చలు సాగుతున్నాయని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లబోతోందని సమాచారం. ప్రస్తుతం శ్రీనివాస్...బోయపాటి శ్రీను రూపొందిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు.

    తమిళంలో విజయం సాధించిన 'సుందర పాండ్యన్' రీమేక్ హక్కులను గట్టి పోటీని ఎదుర్కొని తన స్వంతం చేసుకున్నారు 'భీమనేని'. ఈ చిత్రాన్నే తెలుగులో ఆయన స్వీయ దర్శకత్వంలో పునర్నిర్మించనున్నారు. కథ, కథనాలు వైవిధ్యంగా ఉండే ఈ చిత్రాన్ని తమిళంలో దర్శకుడు, హీరో కూడా అయిన 'శివ' నటించగా, ఆయన వద్ద దర్శకత్వ శాఖలో సహాయకునిగా పనిచేసిన ఎస్.ఆర్.ప్రభాకర్ 'సుందర పాండ్యన్'ను తెరకెక్కించారు.

    English summary
    Bheemaneni Srinivas who bagged the re-make rights of Tamil film ‘Sundarapandian’ has been contacting two to three heroes but no one gave green signal. Now he came to Sai Srinivas.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X