ఛత్రపతి బాలీవుడ్ రీమేక్.. లిస్టులోకి మరో సీనియర్ దర్శకుడు

టాలీవుడ్ కమర్షియల్ మాస్ సినిమాలను ఓ వర్గం నార్త్ ఆడియెన్స్ చాలానే ఇష్టపడుతుంటారు. అల్లు అర్జున్, రామ్ పోతినేని, బెల్లంకొండ శ్రీనివాస్ వంటి హీరోల సినిమాలు హిందీలో డబ్ చేస్తే యూ ట్యూబ్ లో 100మిలియన్స్ వ్యూవ్స్ ని చాలా ఈజీగా అందుకుంటున్నాయి. ఇక అందుకే అల్లు అర్జున్ తో పాటు బెల్లంకొండ కూడా బాలీవుడ్ లో డైరెక్ట్ గా సినిమాలను రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు..

బన్నీ పుష్ప అనే పాన్ ఇండియా సినిమాతో రెడీ అవుతుంటే బెల్లంకొండ వారసుడు మాత్రం తెలుగు కథను హిందీలో రీమేక్ చేయడానికి రెడీ అయ్యాడు. ఛత్రపతి సినిమాను బాలీవుడ్ ఆడియెన్స్ కి తనదైన శైలిలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ రీమేక్ సినిమా దర్శకుడు ఎవరనేది సస్పెన్స్ గా మారింది. సాహో దర్శకుడు సుజిత్ కి ఆఫర్ వచ్చినప్పటికీ చేయనని చెప్పేశాడట. ఇక ఇప్పుడు వివి.వినాయక్ ని లైన్ లో పెడుతున్నట్లు తెలుస్తోంది.

Bellamkonda srinivas chatrapathi remake discussion with VV.vinayak

బెల్లంకొండ శ్రీనివాస్ మొదటి సినిమా 'అల్లుడు శీను'ను వినాయక్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇక మళ్ళీ చాలా కాలం తరువాత నిర్మాతల సలహా మేరకు వినాయక్ తో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం.

అయితే ఆ దర్శకుడు నెక్స్ట్ సినిమాను మెగాస్టార్ తో చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. కానీ ఇంకా ఆ ప్రాజెక్టు ఫైనల్ కాలేదు. లూసిఫర్ ని రీమేక్ చేయనున్నట్లు టాక్ వస్తోన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ ఆడియెన్స్ కి నచ్చే విధంగా ఫుల్ స్క్రిప్ట్ కొత్తగా రేడి చేటున్నారట. త్వరలోనే వినాయక్ తదుపరి ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X