ప్రభాస్ సినిమా రీమేక్‌తో బాలీవుడ్‌కు వెళ్లనున్న బెల్లంకొండ.. అక్కడ వర్కవుట్ అవుతుందా?
బెల్లంకొండ శ్రీనివాస్ టాలీవుడ్‌లో స్టార్ హీరోగా నిలదొక్కుకునేందుకు శతవిధాల ప్రయత్నించాడు. చివరకు రాక్షసుడు సినిమాతో మొదటిసారిగా అసలైన సక్సెస్ ఏంటి ఆ రుచి ఎలా ఉంటుందో చూశాడు. రీమేక్ సినిమాయే అయినా కూడా తెలుగులో మంచి విజయాన్ని నమోదు చేసింది. హీరోగా బెల్లంకొండ స్టామినాను నిరూపించుకుంది. అంతకు ముందు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సరైన సక్సెస్ అందుకోలేకపోయాడు.

బుల్లితెరపై ఫేమస్..
అయితే బెల్లంకొండ శ్రీనివాస్.. ఉత్తరాదిన ఎంతో ఫేమస్. అక్కడి బుల్లితెరపై బెల్లంకొండకు భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. మనోడి డబ్బింగ్ సినిమాలు హిందీలో కొన్ని కోట్ల మంది వీక్షించారు. అక్కడి బుల్లితెరపై బెల్లంకొండ ఓ స్టార్. మరీ ముఖ్యంగా బెల్లంకొండ చేసే యాక్షన్ సీక్వెన్స్‌లంటే బాగా ఇష్టపడతారట.

ఆ సినిమాలన్నీ..
బెల్లంకొండ నటించిన జయ జానకీ నాయక, స్పీడున్నోడు, సాక్ష్యం, కవచం వంటి చిత్రాలు కూడా హిందీలో బాగా ఫేమస్ అయ్యాయి. యూట్యూబ్‌లో ఈ సినిమాలకు వందల మిలియన్ల వ్యూస్ ఉంటాయి. అలా బెల్లంకొండ బాబుకు ఉన్న క్రేజ్‌ను అక్కడి నిర్మాతలు వాడుకునే ప్లాన్‌ను వేశారట.

ఛత్రపతి రీమేక్..
ఛత్రపతి సినిమాను ఇన్నాళ్ల తరువాత ఇప్పుడు రీమేక్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు బాలీవుడ్ దర్శక నిర్మాతలు బెల్లంకొండను అప్రోచ్ అయ్యారట. మనోడి యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాకు ప్లస్ అవుతాయని భావిస్తున్నారట. ఈ రీమేక్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందట.
Recommended Video

అది వర్కవుట్ అవుతందా?
ఛత్రపతి కాన్సెప్ట్.. కేజీయఫ్ కాన్సెప్ట్ కాస్త దగ్గరిగా ఉంటుంది. కేజీయఫ్ సినిమా ట్రైలర్ వచ్చినప్పుడు.. సినిమా రిలీజైన సమయంలో ఛత్రపతిలా ఉందనే కామెంట్లు వినిపించాయి. అలాంటి ఛత్రపతి ఇప్పుడు రీమేక్ చేస్తే వర్కవుట్ అవుతుందా? అన్నది చూడాలి.


Click it and Unblock the Notifications











