మరోక బిగ్గెస్ట్ రీమేక్ మూవీతో రాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్

టాలీవుడ్ సినియర్ నిర్మాత బెల్లంకొండ గణేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ మొదటి సినిమాతోనే సాలీడ్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. నటుడిగా ఇంకా అనుకున్నంత రేంజ్ లో క్లిక్కవ్వకపోయినా హై బడ్జెట్ సినిమాల్లో బాగానే నటిస్తున్నాడు. ఇక రానున్న రోజుల్లో మరొక బిగ్గెస్ట్ రీమేక్ తో హిట్టు కొట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఆ సినిమాకు వివి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఇంకా ఆ రీమేక్ పనులు మొదలు కాలేదు. అయితే నార్త్ అడియెన్స్ కు నచ్చే విధంగా ఛత్రపతి స్క్రిప్ట్ ను మొత్తం చేంజ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే మరొక ఇంట్రెస్టింగ్ రీమేక్ తో బెల్లంకొండ హిట్టు కొట్టాలని ట్రై చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల కోలీవుడ్ లో వచ్చిన కర్ణన్ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

Bellamkonda srinivas tamil movie karnan remake plans

ధనుష్ హీరోగా నటించిన కర్ణన్ కోవిడ్ ప్రభావం వలన 50% ఆక్యుపెన్సీతోనే 100కోట్ల బిజినెస్ చేసింది. మొత్తానికి సినిమా హిట్టవ్వడంతో దాన్ని తెలుగులో రీమేక్ చేస్తే తప్పకుండా హిట్టవుతుందని కొంతమంది హీరోలు రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నం చేశారు. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ ఎవరికి దక్కకుండా ముందుగానే మంచి ధరకు ఆ సినిమా హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక ఛత్రపతి రీమేక్ షూటింగ్ ఈ సమ్మర్ అనంతరం మొదలు పెట్టాలని వినాయక్ టీమ్ ప్రణాళికలు రచిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X